Water Diya’s: షాకింగ్ న్యూస్.. దీపాలను నూనెతోనే కాదు ఇలా కూడా వెలిగించవచ్చు!
హిందువులకు అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి.
దిశ, వెబ్‌డెస్క్: హిందువులకు అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి(Diwali) ఒకటి. దీపావళి ఫేస్టివల్(Festival) అంటే పిల్లలకు చాలా ఇష్టం. ఎందుకంటే టపాకాయలు, క్రాకర్స్ (Crackers, crackers) కాల్చుతూ తెగ సంబరపడిపోతుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు దీపావళి నాడు క్రాకర్స్ కాలుస్తూ ఆనందంగా గడుపుతారు. కొత్త బట్టలు ధరించి.. దేవుడ్ని భక్తిశ్రద్ధ (Devotion) లతో కొలుస్తారు. అయితే దీపావళికి అండ్ తర్వాత వచ్చే కార్తీక మాసం (Kartika month)లో నెల అంతా సాయంత్రం దీపారాధన(Kartika month) చేస్తారన్న విషయం తెలిసిందే. కామన్ గా అయితే అందరూ దీపాలు వెలిగించడానికి నూనెను ఉపయోగిస్తారు. ఇక ప్రస్తుత రోజుల్లో నూనె ధరలు (Oil prices) కొండెక్కి కూర్చున్నాయి. కాగా దీపం వెలిగించడానికి నూనెకు బదులుగా నీటితో కూడా వెలిగించవచ్చని మీకు తెలుసా..?
నీటితో కూడా దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది. అంతేకాకుండా నూనె కూడా సేవ్ అవుతుంది. మనీ సేవ్ అవుతుంది. మరీ వాటర్(Water) తో దీపం ఎలా వెలిగించడం అని ఆశ్చర్యపోతున్నారా? ఎలాగో ఇప్పుడు చూద్దాం.. ముందుగా వత్తులను నూనెలో నాన బెట్టాలి. అనంతరం దీపాల్లో ఆ వత్తులను పెట్టి.. 80 శాతం వరకు వాటర్ పోయాలి. దీనిలో ఒక చెంచా నూనె వేసుకోవాలి. అంతే తర్వాత దీపం వెలిగించండి. నూనె పోసిన దీపం కంటే ఈ దీపం ఎక్కువసేపు వెలుగుతుంది. అలాగే నల్ల మరకలు కూడా పడకుండా ఉంటుంది. ఈ చిన్న ట్రిక్ మీరు కూడా ఫాలో అవ్వండి.. ఆయిల్ ను ఆదా చేయండి.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.