సోషల్ మీడియా సంబంధిత పీడకలలు.. దెయ్యం కంటే దారుణమైన భయాన్ని కలిగిస్తున్నాయి...

సోషల్ మీడియా ప్రపంచాన్ని ఒక్క చోటుకు చేరుస్తుంది. ప్రజలంతా ఒకరినొకరు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా మితిమీరిన వినియోగం

Update: 2024-06-02 15:16 GMT

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా ప్రపంచాన్ని ఒక్క చోటుకు చేరుస్తుంది. ప్రజలంతా ఒకరినొకరు కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా మితిమీరిన వినియోగం మానసిక అనారోగ్యానికి కారణం అవుతుంది. టీనేజర్స్ లో ఆత్మహత్యలకు దారితీస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా శాస్త్రవేత్తలు మరో కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ చేశారు. 'సోషల్ మీడియా రిలేటెడ్ పీడకలలు ' అంటూ ఇంట్రెస్టింగ్ టాపిక్ తెరమీదకు తెచ్చారు.

విషయం ఏంటంటే.. సోషల్ మీడియాలో 24 గంటలు యాక్టివ్ గా ఉండే యూజర్స్ కలలో కూడా దాని గురించి ఆలోచిస్తారు. సరిగ్గా లాగిన్ అవగలుగుతున్నామా? అందరికీ అవెలెబుల్ లో ఉంటున్నామా లేదా? లాగిన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఫాలోవర్స్ అందరితో కనెక్ట్ అవగలుగుతున్నానా? అన్ని ఫొటోస్ అప్ డేట్ చేశానా? సెక్సువల్ హరాజ్మెంట్ ఎదుర్కొంటానా ఏంటి? వంటి ఆలోచనలు కలలో కూడా వెంటాడుతున్నాయి.

రాత్రి నిద్రను డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇలాంటి పీడకలలు తీవ్రమైన ఆందోళన, నిద్ర లేమి, మనస్సుకు శాంతి లేకుండా బాధను కలిగిస్తున్నాయి. మానసిక వ్యధకు కారణం అవుతున్నాయి.

అందుకే సోషల్ మీడియా వినియోగానికి లిమిట్స్ పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. మనం షేర్ చేసే కంటెంట్ గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని హెచ్చరిస్తున్నారు. ఆన్ లైన్ ఇంటరాక్షన్స్ స్ట్రెస్ లేకుండా చూసుకోవాలని.. ఎమోషనల్ కనెక్షన్ తగ్గించుకోవాలని, ఒకవేళ ఒత్తిడి అధికం అవుతుంది అనుకుంటే బ్రేక్ తీసుకోవడం బెటర్ అంటున్నారు. Facebook, Instagram వంటి పాపులర్ ప్లాట్ ఫామ్స్ నుంచి వీక్ ఆఫ్ తీసుకోవడం హెల్త్ ను కాపాడుతుందని అంటున్నారు.


Similar News