రోజంతా ఏసీ గదిలో కూర్చుంటే ఈ తిప్పలు తప్పవు...

ఎయిర్ కండిషనర్లు ఇండోర్ ఉష్ణోగ్రతలు, తేమను నియంత్రించడంలో సహాయపడతాయి, మరింత సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. బయట ఎండలో నుంచి వచ్చినప్పుడు చాలా ఉపశమనం కలిగిస్తాయి. కానీ ACని క్రమం తప్పకుండా, ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Update: 2024-09-25 14:25 GMT

దిశ, ఫీచర్స్ : ఎయిర్ కండిషనర్లు ఇండోర్ ఉష్ణోగ్రతలు, తేమను నియంత్రించడంలో సహాయపడతాయి, మరింత సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. బయట ఎండలో నుంచి వచ్చినప్పుడు చాలా ఉపశమనం కలిగిస్తాయి. కానీ ACని క్రమం తప్పకుండా, ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అవేంటి? ఎలా అదుపులో ఉంచాలి? తెలుసుకుందాం.

చర్మం, కంటి సమస్యలు

ఎయిర్ కండీషనర్లు కండెన్సేషన్, బాష్పీభవనం ప్రక్రియ ద్వారా గాలి నుంచి తేమను తొలగిస్తాయి. ACని చాలా తక్కువ ఉష్ణోగ్రతకు సెట్ చేసి తేమ తగ్గించడం వల్ల గదిలో గాలి పొడిగా మారుతుంది. దీంతో చర్మం పొడిబారడం, దురద, కంటి చికాకు వంటి సమస్యలకు దారితీస్తుంది.

శ్వాసకోశ సమస్యలు

ఎయిర్ కండీషనర్‌ల నుంచి వచ్చే చల్లటి గాలి వివిధ శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది, ముక్కు కారడం, పొడి గొంతు, దగ్గు వంటివి తలెత్తుతాయి. ముఖ్యంగా ఉబ్బసం లేదా అలెర్జీలు ఉన్న వ్యక్తులలో.. శ్వాసకోశ నాళాలు ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉంది.

తలనొప్పి

చల్లని గాలి, పొడి గాలి, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు, పేలవమైన గాలి నాణ్యత, అంతరాయం కలిగించే నిద్ర కారణంగా ఎయిర్ కండిషనింగ్ అప్పుడప్పుడు తలనొప్పికి కారణమవుతుంది. ఈ సమస్యలు అలసట, పగటిపూట మగతకు కూడా దారితీయవచ్చు.

డీహైడ్రేషన్

ACలు గాలి నుంచి తేమను తొలగిస్తాయి. ఫలితంగా పొడి గాలి శరీరం నుంచి తేమ బాష్పీభవనాన్ని వేగవంతం చేస్తుంది. శరీరం తేమను తిరిగి నింపడం కంటే వేగంగా కోల్పోయినప్పుడు.. నిర్జలీకరణం ఏర్పడుతుంది. అందువల్ల ఎయిర్ కండిషన్డ్ పరిసరాలలో ఎక్కువ కాలం గడపడం వల్ల తేలికపాటి డీహైడ్రేషన్ కు దారితీస్తుంది.

ఇప్పటికే ఉన్న సమస్యలు తీవ్రతరం

ACలను ఎక్కువసేపు లేదా వాటిని చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద యూజ్ చేయడం ఆర్థరైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్, సైనసిటిస్ వంటి ముందుగా ఉన్న అనారోగ్య పరిస్థితులు తీవ్రం అవుతాయి.

గాలిలో కలుషితాల వ్యాప్తి

ACలను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయడం వల్ల బ్యాక్టీరియా, బూజు వృద్ధి చెందకుండా నిరోధించవచ్చు. లేదంటే పేలవమైన నాణ్యత గల ఈ గాలిలోని కలుషితాలు అంటువ్యాధులు, అలెర్జీలను ప్రేరేపించడానికి కారణమవుతాయి.

ఎండకు తట్టుకోలేరు

ఎయిర్ కండిషనింగ్‌పై ఎక్కువగా ఆధారపడినట్లయితే.. వేడి, తేమను తట్టుకునే శరీరపు సహజ సామర్థ్యం తగ్గిపోవచ్చు. ఇది అసౌకర్యానికి దారి తీస్తుంది. ఎయిర్ కండిషనింగ్ లేకుండా సహజ ఉష్ణోగ్రతలను ఫేస్ చేయడంలో ఇబ్బందిని కలిగిస్తుంది.

సమస్యలకు పరిష్కారం

  • ఏసీ వల్ల చర్మం పొడిబారడం జరిగితే మాయిశ్చరైజర్ వినియోగించండి. కంటి చికాకును తగ్గించేందుకు ఓవర్ ది కౌంటర్ చుక్కల మందులు వాడండి.
  • ఎయిర్ కండిషన్ కారణంగా డిహైడ్రేట్ అవుతున్నట్లయితే.. నీరు త్రాగడం ద్వారా మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు. అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలను తీసుకోండి.
  • గదిలో ఏసీ టెంపరేచర్ అతిగా తగ్గించకుండా ఉండండి. దీనివల్ల శ్వాసకోశ సమస్యకు తలెత్తొచ్చు. కాబట్టి AC టెంపరేచర్ బయటి ఉష్ణోగ్రత కంటే దాదాపు 3 నుండి 5 డిగ్రీలు తక్కువగా సెట్ చేయండి, గాలిలో తగినంత తేమ స్థాయిలు ఉన్నాయని నిర్ధారించుకోండి.
  • ACని క్రమం తప్పకుండా వాడుతున్నట్లు అయితే.. తయారీదారు సూచనల ప్రకారం ఎయిర్ ఫిల్టర్‌లను సకాలంలో శుభ్రపరచండి. ప్రత్యామ్నాయంగా, మీరు ఇందుకోసం నిపుణుల సలహాలు తీసుకోండి.
  • AC గాలి ప్రవాహం కింద నేరుగా కూర్చోవడం లేదా నిద్రపోవడం వల్ల చర్మం పొడిబారడం, కండరాలు బిగుసుకుపోవడం వంటి అనేక సమస్యలకు దారితీయవచ్చు. అలా కాకుండా చూసుకోండి.
  • తాజా గాలి, సూర్యరశ్మిని పొందడానికి ఎయిర్ కండిషన్డ్ గదుల నుంచి కాలానుగుణంగా విరామం తీసుకోండి.
Tags:    

Similar News