సబ్జా గింజలతో సైడ్ ఎఫెక్ట్.. అతిగా తినేవారు ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
దిశ, వెబ్‌డెస్క్: అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న సబ్జా గింజలు బరువు తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయని న్యూట్రిషనిష్టులు చెబుతారు. ఎండాకాలంలో శరీరం చల్లబడడం కోసం వీటిని నీటిలో నానబెట్టి తీసుకుంటారు. చియా సీడ్స్‌తో ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నప్పటికీ అధిక మోతాదులో తింటే మాత్రం సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవెంటో చూద్దాం..
* సబ్జా గింజలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. అతిగా తింటే సరిగ్గా జీర్ణం కాక విరేచనాలు, ఉబ్బరం, స్టమక్ క్రాంప్స్ వస్తాయి.
* ఈ గింజల్లో ఉండే ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్లకు రక్తాన్ని పలుచగా చేసే లక్షణాలు ఉంటాయి. రక్తపోటు సమస్యలకు దారితీస్తుంది.
* బీపీ టాబ్లెట్స్ వాడేవారైతే సబ్జా గింజలను తినే ముందు తప్పనిసరిగా డాక్టర్ల సలహా తీసుకోవాలి.
* సబ్జా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి చక్కెరను గ్రహించే గట్ సామర్థాన్ని ఆటంకపరుస్తాయి. దీంతో రక్తంలో షూగర్ లెవల్స్ తగ్గుతాయి.
రోజూ ఎంత మొత్తంలో తీసుకోవాలంటే?
* ప్రతి రోజూ 1-1.5 టేబుల్ స్ఫూన్ల వరకు మాత్రమే తీసుకోవాలి.
* ఈ విధంగా తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్ శరీరానికి అందుతాయి.
Read more:
ఉదయాన్నే వేడి వేడి టీ తాగితే ఎంత డేంజరో తెలుసా?
జెనెటిక్ వ్యాధుల నివారణకు ‘హ్యూమనైజ్డ్ మౌస్ మోడల్’ను రూపొందించిన సైంటిస్టులు