Sick Leave: సిక్ లీవ్ కావాలంటే వారం రోజుల ముందే చెప్పాలి..

ఆఫీస్ లో పని చేయాలంటే సవా లక్ష రూల్స్ పాటించాలి. టైమింగ్స్ మొదలు ఈమెయిల్స్, మేసేజ్, కాల్స్, ప్రాజెక్ట్ డీలింగ్స్ ఇలా అన్ని చోట్ల నిబంధనలు ఫాలో కావాల్సిందే. ముఖ్యంగా లీవ్ తీసుకోవాలంటే స్ట్రాంగ్ రీజన్, ఎక్స్ ప్లనేషన్

Update: 2024-08-01 07:16 GMT
Sick Leave: సిక్ లీవ్ కావాలంటే వారం రోజుల ముందే చెప్పాలి..
  • whatsapp icon

దిశ, ఫీచర్స్: ఆఫీస్ లో పని చేయాలంటే సవా లక్ష రూల్స్ పాటించాలి. టైమింగ్స్ మొదలు ఈమెయిల్స్, మేసేజ్, కాల్స్, ప్రాజెక్ట్ డీలింగ్స్ ఇలా అన్ని చోట్ల నిబంధనలు ఫాలో కావాల్సిందే. ముఖ్యంగా లీవ్ తీసుకోవాలంటే స్ట్రాంగ్ రీజన్, ఎక్స్ ప్లనేషన్ కచ్చితంగా అవసరం. కానీ సిక్ అయితే ఏం చేయలేం కాబట్టి లీవ్ ఇవ్వాల్సిందే. ఒకవేళ ఆఫీస్ కు వచ్చిన సరైన అవుట్ పుట్, ప్రొడక్టివిటీ ఉండదు కాబట్టి మేనేజర్లు కూడా ఓకే చెప్పేస్తారు. అయితే ప్రస్తుతం ఓ ఎంప్లాయీ, మేనేజర్ మధ్య జరిగిన సంభాషణ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. సిక్ లీవ్ కావాలంటే ఆధారాలు చూపమనడం వరకు ఓకే కానీ ఈయన మాత్రం ఏకంగా వన్ వీక్ ముందు చెప్పాలని రిప్లయ్ ఇవ్వడమే.. ఈ కన్వర్జేషన్ వైరల్ అయ్యేందుకు కారణం అయ్యింది.

నెట్టింట వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ ప్రకారం... ఎంప్లాయీ తనకు హెల్త్ బాగాలేదని, సిక్ లీవ్ కావాలని మెసేజ్ చేశాడు. అయితే ఈరోజు ఇలా లీవ్ తీసుకోవడం కరెక్ట్ అనుకుంటున్నావా అని అడుగుతాడు మేనేజర్. సిక్ లీవ్, క్యాజువల్ లీవ్ తీసుకోవడానికి కనీసం ఏడు రోజుల ముందు చెప్పాల్సి ఉంటుందని నొక్కి చెప్తాడు. దీంతో షాక్ అయినా ఎంప్లాయీ.. ఈ చాట్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'వారం రోజుల ముందే అనారోగ్యంతో ఉంటానని తెలుసుకోవడం ఎలా?' అనే క్యాప్షన్ తో ఒపీనియన్ అడిగాడు.

ఇక దీనిపై స్పందించిన నెటిజన్లు.. అదిరిపోయే రియాక్షన్ ఇచ్చారు. 'రాబోయే వారంలో ఆరోగ్యంగా ఉన్నావా అని ముందు అతన్ని అడగండి ' అని ఒకరు కామెంట్ చేయగా.. ' ప్రతి రోజూ మెయిల్ చేయండి.. వన్ వీక్ ముందే చెప్పినట్లు ఉంటుంది ' అని ఇంకొకరు సజెస్ట్ చేశారు. ఇక కొందరు ఇలాంటి అనుభవాలను షేర్ చేసుకోవడం మొదలు పెట్టగా.. ఈ టాపిక్ వైరల్ అయిపోయింది.





 


Tags:    

Similar News