టీచర్లకు జీతంగా వోడ్కా పంపిణీ.. బంపర్ ఆఫర్ కింద 15 బాటిల్స్ ఫ్రీ..

సాధారణంగా ఉపాధ్యాయులను గౌరవంగా చూస్తారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే వారిని తల్లిదండ్రులు కూడా పూజిస్తారు. జీతాలు పెంచేందుకు ప్రభుత్వాలూ

Update: 2024-09-09 12:17 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఉపాధ్యాయులను గౌరవంగా చూస్తారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే వారిని తల్లిదండ్రులు కూడా పూజిస్తారు. జీతాలు పెంచేందుకు ప్రభుత్వాలూ ముందుకు రావచ్చు. కానీ ఆల్కహాల్ ఇచ్చి పండగ చేసుకోమనే పని మాత్రం చేయరు. అసలు ఈ ఆలోచన ఎవరికి రాదు కూడా. కానీ రష్యాలో ఇదే జరిగింది.

సెర్బియాలో టీచర్లకు జీతం కింద డబ్బులకు బదులుగా వోడ్కా బాటిల్స్ చెల్లించారు. 1998లో ఈ ఘటన జరిగింది. ఒక జిల్లాలోని దాదాపు ఎనిమిది వేల స్కూళ్లకు ఇదే విధంగా చెల్లించగా.. నిజానికి ముందుగా టాయిలెట్ పేపర్, కాఫిన్స్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ వోడ్కా అయితే ఫుడ్ కొనుక్కోవడానికి లేదా ఎక్స్ చేంజ్ చేసుకోవడానికి వీలు ఉంటుందని ఫైనల్ గా నిర్ణయించారు. ఒక్కొక్కరికి 15 బాటిల్స్ పంపిణీ చేశారు.

Tags:    

Similar News