Secrets of Skin: చర్మం గురించి మీకు తెలియని విషయాలెన్నో.. బాడీలో ఎన్ని పనులు చేస్తుందో తెలుసా?

మన బాడీలో చర్మం అతిపెద్ద అవయవం.

Update: 2024-09-27 08:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: మన బాడీలో చర్మం అతిపెద్ద అవయవం. శరీరంలోని గుండె, లంగ్స్, కాలేయంలా స్కిన్ కూడా ఒక అవయమే. 2.7 కిలోల నుంచి 4.5 కిలోల వరకు స్కిన్ బరువు ఉంటుంది. బాడీ మీదున్న వైశాల్యం 25 చదరపు అడుగులు. సగటు బరువు 3 కిలోలు ఉండగా.. చర్మం బరువు శరీర బరువులో 15 వ వంతు ఉంటుంది. 196 అడుగుల రక్తనాళాలు ఉంటాయి. అలాగే 645 స్వేద గ్రంథులు, 77 అడుగుల నాడులు, 10 నూనె గ్రంథులు, చర్మంలో ఎన్నో సూక్ష్మ రక్తనాళాలు, ప్రతి గంటకు 6 లక్షల చర్మ కణాలు మానవ దేహాన్ని విసర్జిస్తుందని అంచనా. స్కిన్ లో కెరటినోసైట్స్, ఫైబ్రోబ్లాస్ట్లు అనే రెండు చర్మ కణాలు ఉంటాయి. ఈ రెండు పొరలతో చర్మం నిర్మించబడి ఉంటుంది. లోపలి బాగాన్ని డెర్మిన్ అని.. పై భాగాన్ని ఎపిడెర్మిస్ అని అంటారు. స్కిన్ బాడీ మొత్తంలో ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో మందంగా, కొన్నింటి దగ్గర అతి పల్చగా ఉంటుంది. చర్మాన్ని 3 పొరలుగా విభజించుతారు.

చర్మం చేసే అతి ముఖ్యమైన పనులు..

చర్మం మన శరీరానికి హాని కలిగించే క్రిముల నుంచి కాపాడుతుంది. క్రిములను బాడీలోనికి పోనివ్వకుండా రక్షిస్తుంది. చర్మానికి రక్షణనిచ్చే వాటర్ ఫ్రూఫ్ గుణం ఉంటుంది. వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా.. స్కిన్ బాడీకి ఆకృతిని కలిగిస్తుంది. సూర్యరశ్మి నుంచి ఆల్ట్రా వయొలెట్ కిరణాలను గ్రహిస్తుంది. తద్వారా విటమిన్ డి ను రెడీ చేసి బాడీకి అందించడంలో మేలు చేస్తుంది. అవయవాలన్నింటినీ వాటి వాటి స్థానాల్లో ఉంచుతుంది. ఒత్తిడి, గాయాల నుంచి భౌతిక, రసానిక పదార్థాల నుంచి చర్మం కాపాడుతుంది. దీనికి సాగి ముడుచుకుపోయే గుణం ఉంటుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News