బ్లాక్ హోల్‌ వంటి మరో అగాధం.. భూమిపైనే అత్యంత లోతైన సముద్ర బిలాన్ని గుర్తించిన సైంటిస్టులు

సైంటిస్టులు ఇప్పటికే అనేక విశ్వ రహస్యాలను కనుగొన్నారు. వింత గొలిపే భారీ బ్లాక్ హోల్స్ గురించి కూడా విడమరిచి చెప్పారు. అయినా అంతుపట్టని విషయాలు ఇంకెన్నో ఉన్నాయని కూడా అంటున్నారు.

Update: 2024-05-03 08:53 GMT

దిశ, ఫీచర్స్ : సైంటిస్టులు ఇప్పటికే అనేక విశ్వ రహస్యాలను కనుగొన్నారు. వింత గొలిపే భారీ బ్లాక్ హోల్స్ గురించి కూడా విడమరిచి చెప్పారు. అయినా అంతుపట్టని విషయాలు ఇంకెన్నో ఉన్నాయని కూడా అంటున్నారు. ఇప్పటికీ పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఏంటంటే.. విశ్వంలో కృష్ణ బిలాల(బ్లాక్ హోల్స్) గురించి మనకు తెలిసిందే. కానీ అలాంటి భయంకరమైన అగాధం ఒకటి ఈ భూమిపై కూడా ఉందని గుర్తించారు. దీనినే బ్లూ హోల్‌ (సముద్ర బిలం) అని పేర్కొంటున్నారు.

శాస్త్రవేత్తలు మెక్సికోలోని చెటుమాల్ బే ప్రాంతంలో కొత్తగా గుర్తించిన ఈ సముద్ర బిలం వాస్తవానికి ప్రపచంలో కెల్లా అత్యంత లోతైన బ్లూహోల్‌గా పేర్కొంటున్నారు నిపుణులు. దీనిని టాం జా బ్లూ హోల్ అని కూడా పిలుస్తున్నారు. సముద్ర మట్టానికి దిగువన 420 మీటర్ల లోతులో ఉన్న ఈ వింతైన అగాధం చికాగోలోని ఫేమస్ ట్రంప్ టవర్ కంటే కూడా లోతుగా ఉందట. కాగా ఇప్పటి వరకు అత్యంత లోతైన బ్లూ హోల్‌గా ప్రసిద్ధి చెందిన చైనా సముద్రంలోని శాన్షా యోంగల్ బ్లూ హోల్ కంటే కూడా టాం జా బ్లూహోల్ సుమారు 490 అడుగులు ఎక్కువ లోతగా ఉందని ‘ఫ్రాంటియర్స్ ఇన్ మెరైన్ సైన్స్’‌ అధ్యయనం కూడా పేర్కొన్నది.

సముద్ర బిలాలు ఎలా ఏర్పడతాయి?

వాస్తవానికి కొన్ని లక్షల సంవత్సరాలుగా ప్రవహించిన హిమానీ నదాలు భూగోళంపై పలు చోట్ల లోపలి ప్రదేశాలకు కుంచించుకుపోయి భారీ అగాధాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ప్రస్తుతం మహా సముద్రాల్లో నిలువుగా ఉండే గుహల మాదిరి ఇవి ఉంటాయి. కాగా వీటిలో లోత్తుల్లో అన్వేషణ కొనసాగించడం పెద్ద సవాలుగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే టాం జా బ్లూహోల్ లోతులో ఏముందనేది పూర్తి క్లారిటీగా తెలియదు కానీ, భిన్నమైన జీవవైవిధ్యం ఉంటుందని మాత్రం శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంకా పరిశోధనలు కనొసాగుతున్నాయి.


Similar News