ఎకో ఫ్రెండ్లీ ట్రెడీషనల్ గ్లాస్.. కొత్తగా క్రియేట్ చేసిన సైంటిస్టులు
కళ్లకు పెట్టుకునే గాగుల్స్ మొదలు ఇంటి నిర్మాణాల్లో వాడే గాజు కిటికీల వరకు వాటి తయారీ వెనుక పెద్ద ప్రాసెస్ ఉంటుంది.
దిశ, ఫీచర్స్ : కళ్లకు పెట్టుకునే గాగుల్స్ మొదలు ఇంటి నిర్మాణాల్లో వాడే గాజు కిటికీల వరకు వాటి తయారీ వెనుక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే పదార్థాలను వాటి ఉత్పత్తి ప్రక్రియలో వాడుతారు. ఈ సందర్భంగా కార్బన్ డయాక్సైడ్ అధిక మొత్తంలో విడుదలవుతూ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా పెన్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు పర్యావరణ అనుకూలమైన గ్లాస్‌ను సృష్టించారు.
కొత్తగా కనుగొన్న గాజు ఉత్పత్తి ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల సామర్థ్యం సగానికి పైగా తగ్గుతుండటం వల్ల అది ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్‌గా ఉంటుందని సైంటిస్టులు పేర్కొంటున్నారు. తమ న్యూ ప్రొడక్ట్‌కు వారు లయన్ గ్లాస్ అని పేరు పెట్టారు. దీనిని ఉత్పత్తి చేయడానికి తక్కువ శక్తి అవసరం అవుతుందని, స్టాండర్డ్ సోడా లైమ్ సిలికేట్ గ్లాస్‌తో పోలిస్తే లయన్ గ్లాస్ ఎక్కువ పర్యావరణ అనుకూలమైందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ ప్రొడక్ట్ పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశామని, త్వరలో మార్కెట్‌లోకి తమ ఎకో ఫ్రెండ్లీ గ్లాసెస్ ప్రవేశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మూడు నామాలే ఎందుకు అలంకరిస్తారో తెలుసా?
ఎకో ఫ్రెండ్లీగా ఉంటున్న ప్రజలు.. గతంకంటే 32 శాతం పెరిగిన పర్యావరణ స్పృహ