Shocking : పురుషుల వృషణాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్

ప్రతి చోటా ప్లాస్టిక్ పొల్యూషన్ ఉందనడంలో సందేహమే లేదు. మనిషి ఊపిరితిత్తులు, రక్తంలోనూ మైక్రోప్లాస్టిక్స్ చేరిపోగా.. తాజాగా

Update: 2024-06-03 09:37 GMT

దిశ, ఫీచర్స్: ప్రతి చోటా ప్లాస్టిక్ పొల్యూషన్ ఉందనడంలో సందేహమే లేదు. మనిషి ఊపిరితిత్తులు, రక్తంలోనూ మైక్రోప్లాస్టిక్స్ చేరిపోగా.. తాజాగా మానవుని వృషణాల్లో కూడా గుర్తించారు శాస్త్రవేత్తలు. అంచనా వేసిన దానికన్నా ఎక్కువ మొత్తంలో ఉందని తెలిపారు. 47 కుక్కలు, 23 మంది పురుషులపై జరిగిన ప్రయోగంలో ఈ ఫలితాలు గుర్తించారు. ప్లాస్టిక్ కాలుష్యం మగ వారి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు UNM కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రొఫెసర్లు.

కాగా ఈ బృందం వ్యక్తి మరణించాక ఏడేళ్ళు శవాన్ని స్టోర్ చేసే న్యూ మెక్సికో ఆఫీస్ ఆఫ్ ది మెడికల్ ఇన్వెస్టిగేటర్ నుంచి మానవ కణజాలాన్ని తీసుకుని పరిశీలించింది. అలాగే కుక్క కణజాల నమూనాలు సిటీ ఆఫ్ అల్బుకెర్కీ జంతు ఆశ్రయాలు, స్పే-న్యూటరింగ్ విధానాలను నిర్వహించే ప్రైవేట్ వెటర్నరీ క్లినిక్‌ల నుంచి తీసుకుంది. ఈ వృషణాల నమూనాల నుంచి కొవ్వు, ప్రోటీన్‌లను ఫిల్టర్ చేసిన తర్వాత పరిశోధకులు చిల్లింగ్ డిస్కవరీ చేసారు. కుక్కలలో ఒక గ్రాము కణజాలానికి 122.63 మైక్రోగ్రాముల ప్లాస్టిక్ ఉండగా.. పురుషుల్లో ఒక గ్రాము కణజాలానికి 329.44 మైక్రోగ్రాముల ప్లాస్టిక్ ఉన్నట్లు కనుగొన్నారు.

కాగా శవపరీక్ష నమూనాలలో పురుషుల సగటు వయస్సు 35 అని అధ్యయనం పేర్కొంది. దానిని దృష్టిలో ఉంచుకుని, ఈ ప్లాస్టిక్ కాలుష్యం దశాబ్దాల క్రితమే బాల్యంలో ప్రారంభమై ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. దీని అర్థం పురుషులలో తక్కువ స్పెర్మ్ కు కారణం చిన్నప్పటి నుంచే ప్లాస్టిక్ కు ఎక్స్ పోజ్ కావడమని వివరించారు.


Similar News