రుణ గ్రహీతలకు ఎస్​బీఐ అదిరే ఆఫర్స్​

లోన్ తీసుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరే శుభవార్త తీసుకొచ్చింది.

Update: 2023-06-20 07:50 GMT

దిశ, వెబ్​డెస్క్​ : లోన్ తీసుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరే శుభవార్త తీసుకొచ్చింది. సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గ్రీన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో యూనిట్లు కొనుగోలు చేసే వారికి మరోమారు స్పెషల్ స్కీమ్ తీసుకొచ్చింది. గ్రీన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో ఎవరైతే ఇల్లు కొనుగోలు చేస్తారో వారికి హోమ్ లోన్స్‌పై 10 నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు తక్కువ వడ్డీ రేటు లభించనుంది.

     అంటే గృహ రుణం వడ్డీ రేట్లపై భారీ తగ్గింపు లభిస్తుంది. మరోవైపు ప్రముఖ ప్రైవేటు ఫైనాన్షియల్ సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ, ఐఐఎఫ్ఎల్ వంటి కంపెనీలు కూడా గ్రీన్ హోమ్ ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. మరెందుకు ఆలస్యం గ్రీన్ హోమ్ ప్రాజెక్టుల్లో ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇదే మంచి సమయం. 

Tags:    

Similar News