పక్కింట్లో పూలు కోస్తే.. వచ్చే జన్మలో ఎలా పుడుతారో తెలుసా?
దేవునికి పూజ చేసే క్రమంలో పూవులనేవి తప్పకుండా పెడుతుంటాము. ఇక చాలా మంది ఈ విషయంలో తమకు తెలియకుండానే తప్పులు చేస్తారు. కొందరి ఇంట్లో పూజ జరుగుతుంది అంటే
దిశ, వెబ్‌డెస్క్ : దేవునికి పూజ చేసే క్రమంలో పూవులనేవి తప్పకుండా పెడుతుంటాము. ఇక చాలా మంది ఈ విషయంలో తమకు తెలియకుండానే తప్పులు చేస్తారు. కొందరి ఇంట్లో పూజ జరుగుతుంది అంటే చాలు, ఇంటి పక్కవారి చెట్ల పూలో లేదా ఎక్కడైనా తోటలలో దొంగతనంగా పూలు కోసుక రావడం చేస్తుంటారు. మరికొందరు, పూజలో కూర్చున్న తర్వాత పక్కవారి తాంబులంలో పూలు లేదా నూనె, వత్తులు తీసుకోవడమో చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదు అంటున్నాయి పురాణాలు. అంతే కాదండోయ్ ఇతరుల చెట్లకున్న పూలను కోసి పూజచేయడం కూడా అస్సలు మంచిది కాదంట. ఎందుకు అనుకుంటున్నారా ? అయితే మీరే తెలుసుకోండి.
మనకు పురాణాలలో ప్రతి దానికి గురించి వివరణ ఇచ్చారు. అంతే కాకుండా దేవతలను పూజించే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని విరించారు. పూజకు వాడే వస్తువులు దొంగతనంగానో లేదా అడగకుండానో, ఇతరులవి ఉపయోగిస్తే ఏం జరుగుతుందో శ్రీమహావిష్ణువు గరత్మంతుడికి వివరించినట్లు గరుడ పురాణంలో తెలుపబడింది. దాని ప్రకారం.. తాంబూలం, పూలు, ఫలాలు మొదలైనవి దొంగతనం చేస్తే అడవిలో కోతిగా జన్మిస్తారు, పాదుకలు, గడ్డి, పత్తి తదితరాలు అపహరిస్తే మేకగా జన్మిస్తారని దీని అర్థం. అయితే పూలు, పలాల విషయంలో ఇలాంటి తప్పిదాలు అస్సలు చేయకూడదంట. అంతే కాకుండా ఇతరుల చెట్ల పూలు అడగకుండా కోయడం మహా పాపం అంటున్నారు పండితులు. అలా చేస్తే అది దొంగతనం కిందే లెక్కంట. అలాగే మన ఇంటి పూలు కోసే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని పండితులు చెప్తున్నారు. చెట్టుకున్న మొత్తం పూలు కోయకుండా.. కొన్ని పూలు వదిలి పెట్టాలంట. ఇలా చేస్తే మంచి జరుగుతుందని నమ్మిక.