విద్యార్థుల్లో మానసిక అనారోగ్య సమస్యలకు కారణాలు ఇవే.. తల్లిదండ్రులను హెచ్చరిస్తున్న నిపుణులు..

మన దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువగా ఉన్నాయని ఇటీవల ఓ అధ్యయనం వివరించింది. నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే మానసిక సమస్యలతోనే ఇలా జరుగుతుందని తెలుస్తుండగా.. అసలు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయో చెప్తున్నారు నిపుణులు. తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు.

Update: 2024-09-14 12:58 GMT

దిశ, ఫీచర్స్ : మన దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువగా ఉన్నాయని ఇటీవల ఓ అధ్యయనం వివరించింది. నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే మానసిక సమస్యలతోనే ఇలా జరుగుతుందని తెలుస్తుండగా.. అసలు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయో చెప్తున్నారు నిపుణులు. తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు.

అకాడమిక్ ప్రెజర్

పిల్లల్లో విద్యాపరమైన ఒత్తిడి అధికంగా ఉంటుందని చెప్తున్నారు ఎక్స్ పర్ట్స్. తల్లిదండ్రుల, టీచర్ల అధిక అంచనాలు అందుకునేందుకు.. పరీక్షలు, అసైన్మెంట్స్ లో బాగా రాణించాలని చదువుతున్నారు. ఈ క్రమంలో అధిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు.

సొసైటీతో కనెక్షన్ లేకపోవడం

సాధారణంగా చాలా మంది విద్యార్థులు స్నేహాలతో చెడిపోతారనే అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. పేరెంట్స్ కూడా ఫ్రెండ్స్ తో టైం పాస్ చేయొద్దని సూచిస్తారు. ఇలా అందరితో డిస్ కనెక్ట్ అవడం మూలంగా ఒంటరితనం ఏర్పడుతుంది. చదువు అనే పరుగులో ప్రెజర్ ఎక్కువపోయి.. రిలాక్స్ అయ్యే ఛాన్స్ లేక.. మానసిక సమస్య మొదలు అవుతుంది.

తోటివారి బెదిరింపు, ఒత్తిడి

వ్యక్తిగతంగా లేదా ఆన్ లైన్ లో బెదిరింపులు ఎదురుకావడం...తోటివారి ఒత్తిడి.. నిరాశ, ఆందోళనకు కారణం అవుతుంది. ఇది మానసికంగా బాధిస్తుంది.

కుటుంబ సమస్యలు

కష్టమైన ఇంటి పరిసరాలు, ఆర్థిక ఒత్తిడి, కుటుంబంలో గొడవలు విద్యార్థులను మానసికంగా ప్రభావితం చేస్తాయి. వారిలో వారే బాధపడేందుకు కారణం అవుతాయి.

నిద్రలేమి

చదువు, సామాజిక కట్టుబాట్ల కారణంగా తగినంత విశ్రాంతి తీసుకునే ఛాన్స్ ఉండదు. దీనివల్ల చిరాకు, ఆందోళన పెరుగుతుంది. మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

బాడీ ఇమేజ్ ఇష్యూస్

ఎప్పుడూ ఇతరులతో పోల్చడం మానసిక క్షోభకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్ ఎక్కువైపోయింది. దీనివల్ల తమ మీద తమకు విశ్వాసం తగ్గిపోతుంది. ఫుడ్ డిజార్దర్స్ పెరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News