‘ది రియల్ లైఫ్ హీరోస్’.. కేర్ హాస్పిటల్‌లో ఆర్గాన్ డోనార్స్ లైఫ్ సెలబ్రేషన్స్
బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో ఆత్మీయ వేడుక జరిగింది.
దిశ, వెబ్‌డెస్క్: బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో ఆత్మీయ వేడుక జరిగింది. ‘ది రియల్ లైఫ్’ హీరోస్ పేరుతో ఆర్గాన్ డోనార్స్ లైఫ్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. నిజ జీవిత హీరోలను సత్కరించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ అంజనీ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా.. శవ అవయవ దాతల కుటుంబ సభ్యులు ఆర్గాన్ డొనేషన్‌పై అవగాహన కలిగించేందుకు తరలివచ్చారు. అవయవ దానం.. నిరాశకు గురైన హృదయాల్లో ఆశలు నింపుతాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన జీవందన్ అధినేత డాక్టర్ జి. స్వర్ణలత.. జీవనాధార మిషన్‌కు మద్దతునిస్తూ ఆర్గాన్ డొనేషన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అవయవ దానం వైద్య విధానాలకు అతీతమైనదని.. మానవత్వం అంటే ఏంటో రుజువు చేస్తుందన్నారు. కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్‌లోని అవయవ మార్పిడి కార్యక్రమ బృందం ప్రతినిధి, అనస్థీషియాలజీ విభాగాధిపతి అయిన డాక్టర్ టివిఎస్ గోపాల్.. అవయవ దానం ప్రాముఖ్యతను వివరించారు. అవయవ వైఫల్యంతో బాధపడుతున్న రోగులపై దాని రూపాంతర ప్రభావాన్ని చూపుతుందన్నారు.
అవయవ దాతగా నమోదు చేసుకునే సాధారణ చర్య జీవితం, మరణం మధ్య అంతరాన్ని ఎలా తగ్గించగలదో చెప్పుకొచ్చారు. అవయవ దాతల కుటుంబాల ధైర్యం, కరుణ గురించి కొనియాడారు. ఇక బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్స్‌లోని లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రోగ్రామ్ క్లినికల్ డైరెక్టర్ & హెచ్‌ఓడి డాక్టర్ మహమ్మద్ అబ్దున్ నయీమ్.. మరణించిన వ్యక్తుల అవయవ దానం యొక్క గణనీయమైన ప్రభావాన్ని హైలైట్ చేశారు. ప్రియమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు కుటుంబాలు అనుభవించే మానసిక క్షోభను అంగీకరిస్తున్నట్లు తెలిపారు.
అయితే అవయవ వైఫల్యంతో బాధపడుతున్న రోగులు ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా జీవితంలో సరికొత్త అవకాశాన్ని పొందుతారని.. అలాంటి వ్యక్తుల గురించి ఆలోచించి చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆర్గాన్ డొనేషన్‌కు ముందుకు రావాలని కోరారు. ఈ చర్య అనేక మంది జీవితాలను నిలబెడుతుందన్నారు. అవయవ దానం చేయడంలో కేర్ హాస్పిటల్స్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు CARE హాస్పిటల్స్ HCOO నీలేష్ గుప్తా. ఈ రియల్ లైఫ్ హీరోలు, అవయవ దాతలు, వారి కుటుంబాలతో అనుబంధం గురించి గర్విస్తున్నట్లు తెలిపారు.
Read More: భూగోళం సేఫ్.. 100శాతం రీసైకిల్ చేయబడే ప్లాస్టిక్ రూపొందించిన పరిశోధకులు