ఇంటిల్లీపాదికీ నచ్చే ఫేవరెట్ అల్పాహారం.. మీ రుచిదాహం తీర్చడమే కాకుండా..?
ఉదయం టిఫిన్‌గా అందరూ ఇడ్లీ, దోస, పూరీ, ఉతప్పా, చపాతీ వంటివి తింటుంటారు. కానీ ఓసారి రసం వడలు ట్రై చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఉదయం టిఫిన్‌గా అందరూ ఇడ్లీ, దోస, పూరీ, ఉతప్పా, చపాతీ వంటివి తింటుంటారు. కానీ ఓసారి రసం వడలు ట్రై చేసి చూడండి టేస్ట్ అదిరిపోతుంది. మినపపప్పు సాంబార్ వడలకు ఈ రసం వడలకు చాలా డిఫరెంట్ ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాగా ఉదయమే ఈ రసం వడలు తయారు చేసుకుని తినండి. మరీ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేయండి.
రసం వడల తయారీకి కావాల్సిన పదార్థాలు..
శనగపప్పు రెండు కప్పులు, 4 పచ్చిమిర్చి ఉల్లిపాయ, సన్నటి ముక్కల తరుగు, అరచెంచా అల్లం తరుగు, తగినంత ఉప్పు, కారం, ఇంగువ, కరివేపాకు రెమ్మ, సరిపడా నూనె, కొంచెం చింతపండు, 4 కప్పుల నీళ్లు,
జీలకర్ర పొడి, వెల్లుల్లి ముద్ద తీసుకోవాలి.
రసం వడల తయారీ విధానం..
ముందుగా చింతపండు నానబెట్టి.. స్టవ్ ఆన్ చేసి నానెట్టిన చింతపడును కడాయిలో వేసి 4 కప్పులు వాటర్, జీలకర్ర పొడి, ఇంగువ, వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక సాల్ట్, కారం వేసుకోండి. వడల రసం రెడీ అయినట్లే. తర్వాత శనగపప్పుతో నానబెట్టి.. మిక్సీ పట్టండి. ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం తరుగు వేయండి.
వడల్లాగా బోండాల ఆకారంలో చేసుకుని గోల్డ్ కలర్ లోకి వచ్చేవరకు ఫ్రై చేయండి. ఇప్పుడు వేడి వేడి రసంలో ఈ వడలు వేయండి. ఒక ఐదు నిమిషాలు అలా ఉంచి.. స్టవ్ ఆఫ్ చేస్తే నోరూరించే రసం వడలు తయారు అయినట్లే. రసం ఫ్లేవర్ పీల్చుతూ ఏం చక్కగా తినేయచ్చు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.