అత్యాచారం జరిగినప్పుడు బాధితులకు పక్షవాతం వస్తుందా..? అందుకే ఫైట్ చేయలేకపోతున్నారా..?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడొంతుల మంది మహిళలు లైంగిక వేధింపులు లేదా అత్యాచారానికి గురవుతున్నారు.

Update: 2023-06-17 12:10 GMT

దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడొంతుల మంది మహిళలు లైంగిక వేధింపులు లేదా అత్యాచారానికి గురవుతున్నారు. అయితే సొసైటీ వారిని బాధితులుగా ఎందుకు మారారు? తిరిగి పోరాడేందుకు సాహసం చేయలేకపోయారా? అని నిందిస్తుంది. నిజానికి ఇలాంటి కష్ట సమయంలో వారు పారిపోవాలని, పోరాడాలని కోరుకున్నా సరే అలా చేయలేరని.. దాదాపు 70శాతం మంది బాధితులు ఈ పరిస్థితుల్లో స్తంభించిపోతారని చెప్తున్నారు పరిశోధకులు. ఇది పూర్తిగా అసంకల్పితంగా జరుగుతుందని అంటున్నారు. బెదిరింపులు ఎదురైనప్పుడు మెదడు ప్రతిస్పందన శరీర కదలికపై స్వచ్ఛంద నియంత్రణను అందించే న్యూరల్ సర్క్యూట్‌ను నిరోధిస్తుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అప్లయ్ అవుతుందని, అసంకల్పిత పక్షవాతం (involuntary paralysis) వస్తుందని వివరిస్తున్నారు.

చాలా జంతువులు తేలికపాటి ముప్పుకు ప్రతిస్పందిస్తాయి. పోరాడేందుకు సిద్ధమవుతాయి. కానీ తక్షణ, తీవ్రమైన ముప్పు ఎదురైనప్పుడు వాటి శరీరం పూర్తిగా స్తంభించిపోయి.. సుదీర్ఘమైన అస్థిరత ఏర్పడుతుంది. ఆడ పిల్లలు అత్యాచారాలకు గురైనప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొన్ని దేశాల్లో లైంగిక వేధింపులు లేదా రేప్‌కు గురైనప్పుడు ఎందుకు పోరాడలేదని, తప్పంతా అమ్మాయిదేననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిఘటించడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్ల బాధితురాలు సమ్మతించిందని నేరస్థులు ఆరోపిస్తుండటంతో.. కోర్టు కూడా స్త్రీనే తప్పు పడుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ న్యూరో సైంటిఫిక్ పరిశోధనను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు సైంటిస్టులు. ఇది సెక్సువల్ అబ్యూజ్, రేప్ కేసుల్లో ఆడపిల్లలకు రక్షణ కలిగిస్తుందని అంటున్నారు.


Similar News