Rajma Benefits: వారానికి ఒకసారి అయినా రాజ్మా తినండి.. ఈ సమస్యలకు చెక్ పెట్టేయండి..

మారుతున్న ఆహారపు అలవాట్లను బట్టీ ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారు.

Update: 2024-09-09 06:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: మారుతున్న ఆహారపు అలవాట్లను బట్టీ ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారు. అయితే మనం తినే ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు నిపుణులు. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో వారానికి ఒక్కసారైనా రాజ్మాను చేర్చుకోవాలి అని అంటున్నారు నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చట. మరి వీటిని తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బేసిక్‌గా రాజ్మా గురించి అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు. వీటిని ఎక్కువగా నార్త్ సైడ్ వాళ్ళు వండుతారు. అయితే ఈ మధ్య కాలంలో రాజ్మా రైస్, కర్రీ అని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో అందరూ ఏంటి అసలు ఈ రాజ్మా? దీనిని ఎలా తింటారని అనుకుంటున్నారు. అయితే రాజ్మా వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కూరలుగా వండుకోవచ్చు లేదా రాజ్మా రైస్ ఇలా రక రకాలుగా చేయవచ్చు. ఎవరికి ఎలా తినాలనిపిస్తే అలా వాళ్ల స్టైల్ లో చేసుకోవచ్చు. ఇందులో ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం..

రాజ్మా వల్ల ప్రయోజనాలు:

*రాజ్మా గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేయడంతో పాటు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

*అలాగే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది.

* వీటితో పాటు మధుమేహాన్ని తగ్గించడంతో పాటు బరువును కూడా తగ్గిస్తుంది.

*అలాగే క్యాన్సర్‌ను నిరోధించడంలో రాజ్మా గింజలు బాగా సాయపడతాయి.

*ఇక రాజ్మాలో ఉండే ఫోలేట్ అనే పోషకం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావు.

*అదేవిధంగా ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలను దృఢంగా ఉంచడంలో ఉపయోగపడతాయి.

*అలాగే ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా చేస్తాయి.

*ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలు రాకుండా చేయడంలో సాయపడతాయి.

* ఇకపోతే రాజ్మాని షుగర్ ఉన్నవాళ్లు కూడా తినవచ్చు. వీటిని ‘కిడ్నీ బీన్స్’ అని కూడా అంటారు.

కాబట్టి రాజ్మాను రోజు డైట్లో‌ చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఆరోగ్యానికి మంచిది అని ఎక్కువగా తీసుకోకూడదు. మితంగా మాత్రమే తీసుకోవాలి.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.


Similar News