ఫోన్ చూస్తూ, మాట్లాడుతూ ఇలా చేస్తున్నారా? జైలు శిక్షతో పాటు జరిమానా తప్పదంటున్న అధికారులు

: ప్రస్తుత రోజుల్లో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోతుంది.

Update: 2024-03-20 10:33 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. మన లైఫ్ లో మొబైల్ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఫోన్ చేతిలో లేకపోతే కొంతమంది శ్వాస కూడా తీసుకోలేరు. అంతటి స్టేజ్ కు తీసుకెళ్లింది స్మార్ట్ ఫోన్. ఫుడ్ తినాలన్నా చేతిలో తప్పకుండా మొబైల్ ఉండాల్సిందే. అన్ని తెలిసినా పేరెంట్స్ కూడా పిల్లల విషయంలో తప్పులు చేస్తున్నారు.

చిన్న పిల్లలు మారాం చేస్తే బొమ్మలు, పలు వస్తువులు ఇచ్చి బుజ్జగించాలి. కానీ.. స్మార్ట్ మొబైల్ చేతికిచ్చి ఫోన్లకు అడక్ట్ అయ్యేలా చేస్తున్నారు. ఈ విధంగా చేస్తే పిల్లల మెదడుపై ప్రభావం చూపుతుందని పలు అధ్యనాల్లో పరిశోధకులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఫోన్ల వాడకం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అయితే స్మార్ట్ ఫోన్లతో లాభాల కన్నా నష్టాలే ఎక్కువ జరుగుతున్నాయి. మొబైల్ కొన్ని సార్లు మన ప్రాణాల మీదకు తెచ్చి పెడుతుంది.

అయితే తాజాగా ఫోన్లు చూస్తూ.. మాట్లాడుతూ రైలు ఎక్కినా కఠినమైన శిక్ష విధిస్తామని రైల్వే హెచ్చరించారు. రైల్వే ట్రాక్ పై సెల్ఫీలు దిగినా, పట్టాల వెంబడి రీల్స్, షార్ట్ ఫిల్మ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఫొటో గ్రఫీలు తీసుకుంటే కటకటాల్లోకి వెళ్లడం తప్పదని చెబుతున్నారు. కాగా అధికారుల నిషేధ ఆజ్ఞలను పాటించాలని కోరుతున్నారు.


Similar News