Winter Health : చలికాలంలో ఆర్థరైటిస్‌ను పెంచే ఆహారాలు.. వీటిని తీసుకోకపోవడమే బెటర్!

Winter Health : చలికాలంలో ఆర్థరైటిస్‌ను పెంచే ఆహారాలు.. వీటిని మానేయడమే బెటర్!

Update: 2024-11-07 08:29 GMT

దిశ, ఫీచర్స్ : ఆర్థరైటిస్.. చలికాలంలో చాలా మందిని వేధించే సమస్య ఇది. శరీరంలో రెండు ఎముకలు కలిసే ఏ భాగంలోనైనా తీవ్రమైన నొప్పి ప్రారంభం కావడాన్నే వైద్య పరిభాషలో ఆర్థైటిస్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే కీళ్ల నొప్పులు. వృద్ధుల్లో ఈ సమస్య ఏ సీజన్‌లో అయినా రావచ్చు. వింటర్‌లో మాత్రం ఏజ్‌తో సంబంధం లేకుండా ఎవరిలోనైనా తలెత్తే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అప్పటికే కీళ్ల నొప్పులు ఎదుర్కొనే వారిలో చల్లటి వెదర్, తేమ కారణంగా మరింత అధికం అవుతుంది. అలాంటప్పుడు వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. అయితే ఈ సందర్భంలో కొన్ని రకాల ఆహారాలను తినకపోవడం వల్ల కూడా కీళ్ల నొప్పి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చునిని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేమిటో చూద్దాం.

తీపి పదార్థాలు, పానీయాలు

కీళ్ల నొప్పులకు శరీరంలో మార్పులు, వివిధ అనారోగ్యాలు కూడా కారణం కావచ్చు. 2020 పరిశోధన ప్రకారం ఎక్కువగా తీపి పదార్థాలు తీసుకోవడం, తీయటి పానీయాలు తాగడం కీళ్ల నొప్పులను మరింత పెంచుతుంది. అలాగే రూమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే తీపి పదార్థాలు, పానీయాల్లో చక్కెరైస్థాయిలు అధికంగా ఉంటాయి. ఇందులోని సైటోకిన్లవల్ల శరీరంలో నొప్పి లేదా మంట వంటివి పెరుగుతాయి. అలాగే మధుమేహం ఉన్నవారు అధిక బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

అధిక వేయించిన ఫుడ్స్

ఎక్కువసేపు నూనెలో వేయించిన లేదా కాల్చిన ఆహార పదార్థాలను తినడంవల్ల కూడా కీళ్ల నొప్పి అధికం అవుతుంది. అలాగే ప్రాసెస్ చేసిన మాంసాలు, ముఖ్యంగా రెడ్ మీట్ వంటివి ఆర్థరైటిస్‌ను ప్రేరేపిస్తాయి. కాబట్టి చలికాలంలో కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ ఆహారాలను అవాయిడ్ చేయడం బెటర్.

ప్యూరిన్లు కలిగిన ఆహారాలు

ప్యూరిన్లు అంటే కార్బన్ అండ్ నైట్రోజన్‌తో తయారైన సమ్మేళనాల సమూహం. ఇవి ముఖ్యమైన జీవ అణువులలో కనిపిస్తాయి. ఇవి అధికంగా ఉన్న ఆహారాలు తినడంవల్ల అవి యూరిక్ యాసిడ్‌గా మారి కీళ్ల నొప్పులను పెంచుతాయి. కాబట్టి జంతు ఆధారిత ఆహారాలైన కాలేయం, మూత్ర పిండాలు, క్యాండీలు, డెజర్ట్, అలాగే ఎండు ద్రాక్ష, పండ్ల రసాలు, కాలీ ఫ్లవర్, పుట్టగొడుగులు వంటివి పరిమితికి మించి తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలో ప్యూరిన్లు అధికంగా ఉంటాయి. అలాగే వెన్న, జున్ను, మాంసం, సోడియం అధికంగా ఉండే ప్యాకేజ్డ్‌ ఫుడ్స్ కీళ్ల నొప్పులను పెంచుతాయి కాబట్టి తినకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Read More..

Health : ఆలస్యంగా నిద్రపోయి.. త్వరగా లేస్తున్నారా..? ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే! 

Tags:    

Similar News