సమాధిపై క్యూఆర్ కోడ్.. స్కాన్‌లో విస్తుపోయే విషయాలు

ఎక్కడైనా షాప్‌లో ఉన్నప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టుకుంటారు. తమ అవసరాల నిమిత్తం ఫొన్‌లో క్యూఆర్ కోడ్ అనేది పెట్టుకుంటున్నారు. కానీ ఎక్కడైనా సమాధిపై క్యూఆర్ కోడ్ చూశారా.

Update: 2023-03-23 04:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఎక్కడైనా షాప్‌లో ఉన్నప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టుకుంటారు. తమ అవసరాల నిమిత్తం ఫొన్‌లో క్యూఆర్ కోడ్ అనేది పెట్టుకుంటున్నారు. కానీ ఎక్కడైనా సమాధిపై క్యూఆర్ కోడ్ చూశారా. కానీ సెంట్రల్‌ కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా కురియాచిరా పట్టణానికి చెందిన సెయింట్‌ జోసెఫ్‌ చర్చికి వెళ్లిన వారెవరైనా అక్కడ ఓ సమాధిని చూసి కాసేపు అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే ఆ సమాధి పలకపై పెద్ద సైజులో ఉన్న ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. అయితే సమాధిపై క్యూఆర్ కోడ్ చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అసలు సమాధిపై క్యూఆర్ కోడ్ ఏంటంటూ అక్కడే ఆగిపోయి ఆలోచిస్తున్నారు. మరికొందరేమో దాన్ని స్కాన్ చేస్తున్నారు. అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అందులో ఉన్నవి చూసి షాక్ అవుతున్నారంట. ఇంతకీ అందులో ఏముంది? అసలు సమాధిపై క్యూఆర్ కోడ్ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

26 ఏళ్ల వయసులో అకాల మరణానికి గురైన యువ వైద్యుడు ఐవిన్‌ ఫ్రాన్సిస్‌ సమాధి అది. వైద్యుడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న కుమారుడు చిన్న వయసులోనే తమకు దూరం కావడంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు ఐవిన్‌ జ్ఞాపకాలు సజీవంగా ఉండాలన్న నేపథ్యంతో సమాధిపై క్యూఆర్ కోడ్ పెట్టించారంట. ఇక ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. ఈ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఐవిన్‌ చిత్రాలు, కళాశాలలో కీబోర్డు, గిటార్లతో ఇచ్చిన ప్రదర్శనలు, మిత్రుల వివరాలు అన్నీ చూడవచ్చు. 2021లో బ్యాడ్మింటన్‌ ఆడుతూ కుప్పకూలిపోయిన డాక్టర్‌ ఐవిన్‌ తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చాడు. 

Read more:

గర్భం దాల్చకుండా ఉండటానికి కొత్త పద్ధతి.. AP, TS, UP లో త్వరలో అమలు

Tags:    

Similar News