ఈ ఆయుర్వేద మూలికలతో హీట్‌వేవ్ నుండి రక్షణ.. ఎలా వినియోగించాలంటే..
వేసవి కాలం వచ్చేసింది.
దిశ, ఫీచర్స్ : వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో వచ్చే వ్యాధులను నివారించడానికి ముందుగానే చర్యలు తీసుకోవడం ముఖ్యం. విపరీతమైన వేడి వల్ల డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా చర్మానికి సమస్యలు కూడా వస్తాయి. అలాంటప్పుడు ఈ సీజన్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవి కాలంలో జీవక్రియ మందగిస్తుంది అని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. అందుకే వేసవిలో ఎక్కువగా ఫ్రై, లేదా స్పైసీ ఫుడ్ తినకుండా ఉండాలి. అలాగే ఆయుర్వేద మూలికలను తీసుకోవడం వలన హీట్‌వేవ్ నుండి రక్షణ పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు. మరి ఆ మూలికలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మి..
భారతదేశంలోని పురాతన, సాంప్రదాయ మూలికలలో బ్రాహ్మీ ఒకటి. మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు బ్రహ్మీని ఉపయోగిస్తారు. అలాగే ఒత్తిడిని దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. హీట్‌వెయిట్‌ను నివారించడానికి బ్రహ్మి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
తులసి..
తులసి అత్యంత పవిత్రమైన మూలికలలో ఒకటి. శరీరాన్ని డిటాక్సి ఫై చేయడంతో పాటు క్లెన్సింగ్ ఏజెంట్ కూడా. శరీరాన్ని వేడి నుంచి కాపాడడంలో తులసి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. తులసి ఒత్తిడిని దూరం చేయడంతో పాటు వేడి వల్ల వచ్చే సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
మంజిష్ఠ..
శరీరం నుండి విషాన్ని తొలగించడానికి మంజిష్ఠ బాగా పనిచేస్తుంది. ఈ మూలిక రుచి చేదుగా ఉంటుంది. కానీ దీనిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల జాబితా చాలా పెద్దది. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేషన్, యాంటీ మైక్రోబియల్ వంటి అంశాలు ఉంటాయి. మంజిష్టను ఆయుర్వేదంలోని ముఖ్యమైన మూలికలలో ఒకటిగా కూడా పిలుస్తారు.
అశ్వగంధ..
అశ్వగంధ శరీరంలో శక్తిని పెంచడానికి పనిచేస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంతో పాటు, ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది. అలాగే ఇది వేసవి కాలంలో వేడి తరంగాల నుండి కూడా రక్షిస్తుంది. ఇది అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగించబడుతుంది.