Animal Fat: జంతువుల కొవ్వు తినడం వల్ల కలిగే లాభాలు-నష్టాలు.. కార్డియాలజిస్టులు చెప్పేవివే!
గత కొద్దిరోజుల నుంచి తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: గత కొద్దిరోజుల నుంచి తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఏకంగా బీఫ్ ఫ్యాట్ ఆయిల్స్, పంది కొవ్వు కలిసిందంటున్నారు పలువురు రాజకీయ నాయకులు. రీసెంట్‌గా ఫ్రూప్స్ కూడా చూపించారు. ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూను అపవిత్రం చేసి.. మనోభావాలు దెబ్బతినేలా చేశారు అంటూ ఓ రేంజ్‌లో మండిపడ్డారు. అయితే కేవలం జంతువుల కొవ్వు అపవిత్రమైనదే కాదు.. హెల్త్‌కు కూడా మంచిది కాదని తాజాగా కార్డియాలజిస్టులు. జంతువుల కొవ్వుతో నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జంతువుల కొవ్వు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ కొవ్వులో సంతృప్త కొవ్వులు, ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉంటాయి. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను భారీగా పెంచి.. ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. గుండె అండ్ ఇతర ఆర్గాన్స్‌లో అడ్డంకులు ఏర్పడేలా చేస్తుంది. అలాగే కాలేయ పనితీరు దెబ్బతింటుంది. రెడ్ మీట్‌లో కూడా సంతృప్తి కొవ్వులు అధికంగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తింటే మాత్రం దీర్ఘకాలం అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు ప్రమాదం పెరిగే అవకాశం ఉంది.
ఫిష్ అలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే.. కానీ?
ఫిష్ ఆయిల్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. దీన్ని డైరెక్ట్ తీసుకుంటే హెల్త్ కు మంచిదేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. చెడు కొవ్వును కరిగించడంలో మేలు చేస్తుంది. గుండెకు సంబంధించి ఫిష్ ఆయిల్ చాలా బెనిఫిట్స్ అందిస్తుంది. దీన్ని షుగర్స్‌తో కలిపినప్పుడే హార్ట్ హెల్త్‌పై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. కాగా గుండె సమస్యలు పెరుగుతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
వైద్యుల సలహాలు తప్పనిసరి..
జంతువుల కొవ్వు, షుగర్ అధికంగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే ఇన్సులిన్ నిరోధకత, స్థూలకాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని, ఇవి లివర్, గుండె, మధుమేహం వ్యాధులు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ సంతృప్తి కొవ్వులను హెల్తీ ఫ్యాట్స్‌తో భర్తీ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ పెద్ద మొత్తంలో తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. కొవ్వును డైట్‌లో భాగం చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం డాక్టర్ల సలహా తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.