డైపర్స్‌తో సైడ్ ఎఫెక్ట్స్.. ఎక్కువ సేపు ఉంచితే పిల్లల్లో ఇన్‌ఫెక్షన్స్

పిల్లలకు డైపర్స్ యూజ్ చేయడం ద్వారా తల్లిదండ్రులు కన్వినియంట్‌గా ఫీల్ అవుతారు.

Update: 2023-05-02 09:17 GMT

దిశ, ఫీచర్స్: పిల్లలకు డైపర్స్ యూజ్ చేయడం ద్వారా తల్లిదండ్రులు కన్వినియంట్‌గా ఫీల్ అవుతారు. శిశువు మూత్ర విసర్జన చేసిన ప్రతీసారి రిమూవ్ చేయాల్సిన అవసరం లేకుండా కాటన్ న్యాపీలకు బదులుగా అబ్జార్బెంట్ డైపర్స్‌ను వినియోగిస్తారు. అయితే బిడ్డ మల విసర్జన చేసినా సరే పేరెంట్స్ కొందరు అలాగే ఎక్కువ సేపు ఉంచుతారు. మరోసారి వెళ్లినప్పుడు డైపర్ తీసేద్దామనే ఆలోచనలో ఉంటారు. కానీ ఈ పద్ధతి పిల్లల హెల్త్‌పై ఎఫెక్ట్ చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. డైపర్లలో మూత్రం లేదా మలం ఎక్కువసేపు చర్మానికి కాంటాక్ట్ అవడం మూవలంగా ‘అమ్మోనియాకల్ రాష్’ డెవలప్ అవుతుందని.. తేమతో కూడిన పిల్లల చర్మం ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు.

డర్టీ డైపర్స్ వెంటనే ఎందుకు చేంజ్ చేయాలి?

శిశువులలో ఆస్తమా, మధుమేహం, ADHD(అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) వంటి దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమించడంలో గట్ మైక్రోబయోమ్ కీలక పాత్ర పోషిస్తుంది. తాజా అధ్యయనం ఓ శిశువు గట్‌కు 10,000 వైరల్ ఇన్‌ఫెక్షన్స్ సోకినట్లు నిర్ధారించింది. ఇది సగటు పిల్లలలో కనిపించే బ్యాక్టీరియా జాతుల సంఖ్య కంటే 10 రెట్లు ఎక్కువ. కాగా మలంలో ఉండే బ్యాక్టీరియా సులభంగా ప్రేగులకు బదిలీ చేయబడటం మూలంగా వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని చెప్తున్నారు నిపుణులు.

కాండిడా వంటి ఫంగస్ చర్మంలోని తేమతో కూడిన ప్రాంతాలకు సోకుతుంది. తద్వారా ర్యాషెస్‌కు కారణం అవుతుంది. పైగా డర్టీ డైపర్స్ అలాగే ఉంచడం వలన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (UTIs) వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. మలంలో ఉండే బ్యాక్టీరియా డైపర్‌ల నుంచి మూత్ర నాళంలోకి చేరుకుని UTIలకు కారణం కావచ్చు. అబ్బాయిలతో పోలిస్తే వారి మూత్ర నాళం తక్కువగా, మలద్వారానికి దగ్గరగా ఉన్నందున UTIల ప్రమాదం బాలికలలో ఎక్కువగా ఉంటుంది.

ఇతర ప్రమాదాలు

* శిశువుల చర్మం మృదువుగా, సున్నితంగా ఉంటుంది. హార్ష్ కెమికల్‌కు ఎక్స్‌పోజ్ అయితే వారి స్కిన్‌కు హాని కలుగుతుంది. కొన్ని డైపర్స్‌లో సింథటిక్, కలర్ కెమికల్స్ ఉండటం మూలంగా బిడ్డ సున్నితమైన చర్మం ఎఫెక్ట్ అవుతుంది. అలెర్జీలకు దారితీస్తుంది.

* అంతేకాదు ఈ కెమికల్స్ ఎక్స్‌పోజర్‌తో టాక్సిన్స్ శిశువులోకి ప్రవేశించి దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతుంది.

* డైపర్స్ ఎక్కువ టైమ్ రిమూవ్ చేయకుండా ఉండటం మూలంగా బ్యాక్టీరియా సంతానోత్పత్తికి కేంద్రంగా మారుతుంది. తద్వారా దద్దుర్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

Read more:

పిల్లలు కూరగాయలు తినడం లేదా?.. అయితే ఇలా చేయండి.

Tags:    

Similar News