Viral Video: ప్రియాంక చోప్రా బ్యూటీ సీక్రెట్స్.. అందం కోసం ఇలా చేస్తానంటున్న బ్యూటీ..

సెలబ్రిటీలంటేనే అందానికి కేరాఫ్ అడ్రస్ అంటుంటారు కొందరు. అలా కనిపించడానికి వారు ఖరీదైన క్రీములు వాడుతుంటారని, ఫిట్‌నెస్‌ వ్యాయామాలు చేస్తుంటారని భావిస్తారు.

Update: 2024-08-31 13:38 GMT

దిశ, ఫీచర్స్ : సెలబ్రిటీలంటేనే అందానికి కేరాఫ్ అడ్రస్ అంటుంటారు కొందరు. అలా కనిపించడానికి వారు ఖరీదైన క్రీములు వాడుతుంటారని, ఫిట్‌నెస్‌ వ్యాయామాలు చేస్తుంటారని భావిస్తారు. కొందరు సెలబ్రిటీలైతే తమ బ్యూటీ సీక్రెట్స్ ఏమిటో బయటకు చెప్పరు. కానీ బాలీవుడ్ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మాత్రం అందుకు భిన్నం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ అందం, ఆరోగ్యం కోసం తాను ఎలాంటి టిప్స్ పాటిస్తుందో చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె బ్యూటీ సీక్రెట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే ఇలా..

తాను ఆరోగ్యంగా ఉండేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు డైలీ మార్నింగ్ స్వయంగా డ్రింక్ తయారు చేసుకుంటుందట ప్రియాంక చోప్రా. అదేంటంటే.. అల్లం, పసుపు, నిమ్మ రసం, తేనె గోరు వెచ్చని నీటిలో కలిపి తాగుతానని చెప్పుకొచ్చింది. పాదాల ఆరోగ్యం కోసం వెల్లుల్లిని మడమలపై మర్దన చేస్తానని, అందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలవల్ల ఉపశమనం కలుగుతుందని, ఈ చిట్కాతో నొప్పి, వాపు వంటివి కూడా తగ్గుతాయని చెప్పుకొచ్చింది.

పెదాల అందానికి లిప్ స్క్రబ్

పెదాల ఆరోగ్యానికి ప్రియాంక చోప్రా స్వయంగా లిప్ స్ర్కబ్ తయారు చేసుకుంటుందట. అందుకోసం ఒక బౌల్‌లో, సీ సాల్ట్, వెజిటబుల్ గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి, బాగా మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేస్తానని, దీనివల్ల డెడ్ సెల్స్ పోయి అందంగా తయారవుతాయని చెప్తోంది ప్రియాంక.

బాడీ స్క్రబ్ ఇలా..

ఒక కప్పు శెనగపిండి, పెరుగు, నిమ్మరసం, పాలు కలిపి బాడీ స్ర్కబ్ తయారు చేసుకుంటానని ప్రియాంక చోప్రా వెల్లడించింది. ఇది జిడ్డు చర్మం ఉన్నవారికి కూడా అద్భుతంగా పనిచేస్తుందట. అయితే అందులో గంధం పొడి, పసుపు వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేస్తే చర్మం నిగనిగలాడుతుందని వెల్లడించింది ప్రియాంక చోప్రా.

హెయిర్ బ్యూటీ కోసం

జుట్టు ఆరోగ్యానికి, అలాగే చుండ్రు సమస్యకు కూడా హోం రెమిడీస్ పాటిస్తుందట ప్రియాంక చోప్రా. ఒక గిన్నెలో కొంచెం పెరుగు తీసుకొని, అందులో ఓ గుడ్డును పగలగొట్టి వేయాలని, తర్వాత బాగా గిలక్కొట్టడం ద్వారా అది‌ క్రీమ్ లాగా మారుతుందని, దానిని తలకు అప్లై చేసి షాంపూతో స్నానం చేస్తే జుట్టు మెరిసిపోతుందని ప్రియాంక చోప్రా పేర్కొన్నది. కాగా ఈ చిట్కాలన్నీ వివరిస్తూ ఆమె ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుండగా.. ఆమె బ్యూటీ సీక్రెట్ ఇదా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పలువురు.  

Video Credits to Food phile - saloni on Insta Id


Similar News