భవిష్యత్తులో జైలు శిక్ష .. ఖైదీల మెదడు మాత్రమే టార్గెట్.. శరీరం మాత్రం క్షణాల్లోనే...

సాధారణంగా జైలు కాన్సెప్ట్ ఏంటంటే తప్పు చేసిన వ్యక్తిని కొన్ని రోజులు బంధించి.. మళ్లీ ఆ తప్పు చేయకుండా తీర్చిదిద్దడమే. కానీ ఈ పద్ధతి దోషులను తిరిగి నేరం చేయకుండా అడ్డుకోవడం లేదని అధ్యయనాలు గుర్తించాయి. అదే జరిగితే జైళ్లలో లక్షల మంది ఖైదీలు ఎందుకు ఉంటారనే ప్రశ్న తలెత్తుతుంది. పైగా దీనివల్ల కొందరు ఖైదీలలో మార్పు వచ్చినా..

Update: 2024-07-13 07:16 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా జైలు కాన్సెప్ట్ ఏంటంటే తప్పు చేసిన వ్యక్తిని కొన్ని రోజులు బంధించి.. మళ్లీ ఆ తప్పు చేయకుండా తీర్చిదిద్దడమే. కానీ ఈ పద్ధతి దోషులను తిరిగి నేరం చేయకుండా అడ్డుకోవడం లేదని అధ్యయనాలు గుర్తించాయి. అదే జరిగితే జైళ్లలో లక్షల మంది ఖైదీలు ఎందుకు ఉంటారనే ప్రశ్న తలెత్తుతుంది. పైగా దీనివల్ల కొందరు ఖైదీలలో మార్పు వచ్చినా.. అప్పటికే వయసు మీద పడి కుటుంబంతో జీవితాన్ని ఆస్వాదించే మార్గం లేకుండా పోతుందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్ జైల్స్ ఎలా ఉండాలో ప్లాన్ చేశాడు సైంటిస్ట్ హాషెమ్ అల్-ఘైలీచే.

కాగ్నిఫై అని పిలువబడే డిజైన్ ద్వారా శిక్ష అమలు జరుగుతుంది. ఇందులో ఖైదీ చేసిన తప్పులు, తన వల్ల బాధితుడు పడుతున్న కష్టం గురించి బ్రెయిన్ మ్యాప్ జరుగుతుంది. ఈ సిస్టమ్ VR పరికరాన్ని కలిగి ఉంటుంది. నేరం గురించి AI రూపొందించిన ఫుటేజీని చూపిస్తుంది. కాగా ముందుగా ఖైదీలు హై-రిజల్యూషన్ బ్రెయిన్ స్కానింగ్ చేయించుకుంటారు. అది నాడీ మార్గాల వివరణాత్మక మ్యాప్‌ను సృష్టిస్తుంది. జ్ఞాపకశక్తి, ఆలోచనలకు బాధ్యత వహించే నిర్దిష్ట మెదడు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి మ్యాప్ కాగ్నిఫై పరికరాన్ని అనుమతిస్తుంది. ఈ పనులు హిప్పోకాంపస్, ప్రిఫ్రంటల్ కార్టెక్స్, అమిగ్డాలా, ప్యారిటల్ లోబ్, యాంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్‌లో జరుగుతాయి. గృహ హింస, ద్వేషపూరిత నేరాలు, దోపిడీ, దొంగతనం, మోసం వంటి పనులకు పాల్పడిన ఖైదీలకు వారి నేరాల గురించి AI- సృష్టించిన మెమోరీస్ చూపడం ద్వారా పరికరం పని చేస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు, టెక్నాలజీ అపరాధి బాధను అనుభవించేలా చేస్తుంది. బాధిత కుటుంబం అనుభవిస్తున్న దుఃఖం లేదా బాధితుడి శారీరక, మానసిక గాయం వంటివి చూపించి పశ్చాత్తాపానికి గురయ్యేలా చేస్తాయి. శారీరక ప్రతిస్పందనను కూడా ప్రేరేపిస్తాయి.

హాషెమ్ అల్-ఘైలీచే డెవెలప్ చేసిన ఈ సిస్టమ్.. ఖైదీలో ఫీలింగ్స్, మెమోరీస్ శాశ్వతం చేయడం ద్వారా చికిత్స సెషన్ దీర్ఘకాలిక ప్రభావాలను కలిగిస్తుంది. అంతేకాదు ఈ పద్ధతి కొన్ని నిమిషాల పాటు కొనసాగితే.. ఖైదికి మాత్రం కొన్ని సంవత్సరాలుగా అనిపిస్తుంది. తద్వారా నేరస్థుడు కొన్నేళ్లు జైలులో ఉండి పొందే పశ్చాత్తాపాన్ని కొన్ని నిమిషాల్లోనే పొందగలడు. పూర్తిగా మారిపోయి జీవితంలో ముందుకు సాగగలడు.



Full View


Similar News