Healthy foods : వింటర్‌లో పోషకాహార లోపం.. గర్భిణులకు మేలు చేసే ఫుడ్స్ ఇవే..
Healthy foods : వింటర్‌లో పోషకాహార లోపం.. గర్భిణులకు మేలు చేసే ఫుడ్స్ ఇవే..
దిశ, ఫీచర్స్ : సాధారణంగా చలికాలంలో పోషకాహార లోపం ఏర్పడే అవకాశం కూడా పెరుగుతుంది. మిగతా సీజన్లకంటే ఆహారం తక్కువగా తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడం వంటివి ఇందకు కారణం అవుతాయి. ముఖ్యంగా గర్భిణులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.
* పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే.. గర్భిణులు పాలకూర(Spinach)ను తప్పక తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ముఖ్యంగా ఐరన్ పుష్కలంగా ఉంటాయి. రక్త కణాల నిర్మాణంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
* బాదం, వాల్ నట్స్, ఖర్జూరాలు సహా పలు రకాల డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి గర్భిణులు వీటిని తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. అలాగే సాల్మన్, సార్డిన్, ట్యూనా వంటి చేపలు ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కడుపులో బిడ్డ ఎదుగులకు, ముఖ్యంగా మెదడు ఎదుగుదలకు ఇవి సహాయపడతాయి.
*విటమిన్ ఎ చలికాలంలో వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఇది పుష్కలంగా ఉండే చిలగడ దుంపలను గర్భిణులు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఫైబర్ కంటెంట్ ఉండటంవల్ల జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అట్లనే విటమిన్ సి కలిగి ఉండే ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, దానిమ్మ, రేగిపండ్లు వంటివి తీసుకోవడంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More..
Health : ఆ సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్న కార్బోనేటెడ్ డ్రింక్స్.. వీటిలో ఏముంటాయంటే..