Earthquake : మయన్మార్ భూకంపం... కాపాడమని శిథిలాల కింద కార్మికుని ఆర్తనాదం
మయన్మార్ లో శుక్రవారం భారీ భూకంపం(Thailand Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : మయన్మార్ లో శుక్రవారం భారీ భూకంపం(Thailand Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. వరుసగా మూడుసార్లు వచ్చిన భూకంప ధాటికి పలు ఎత్తైన భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. కూలిపోతున్న భవనాలు, భయంతో పరుగులు తీస్తున్న జనంతో కూడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 55 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించగా.. వందలాది మంది గల్లంతైనట్టు తెలిపింది. తాజాగా మయన్మార్ లో ఓ భారీ భవనం కుప్పకూలగా.. ఆ శిథిలాల కింద చిక్కుకున్న ఒక కార్మికుడు కాపాడమని ఆర్తనాదలు చేయడం కంటతడి పెట్టిస్తోంది. తక్షణమే అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు అతడిని బయటికి తెచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. మరికొంతమంది ఆ శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు థాయ్ లాండ్ ఎమర్జెన్సీ(Emergency) విధించింది ప్రభుత్వం. అన్ని రకాల ట్రాన్స్పోర్టులను నిలిపి వేసింది. బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యల వేగం పెంచింది. సహాయం చేసేందుకు ముందుకు రావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.