యోగా చేయడానికి ముందు, చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో యోగా మన:శాంతిని అందిస్తుంది.
దిశ, ఫీచర్స్: ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో యోగా మన:శాంతిని అందిస్తుంది. బాడీ ఫిట్‌గానూ ఉంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. కాబట్టి యోగ చేసే అలవాటును అవలవర్చుకుంటున్నారు. కానీ యోగా చేసే ముందు, తర్వాత కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తర్వాత బాధపడుతుంటారు. ఇంతకీ ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం.
యోగా ముగిసిన వెంటనే నీళ్లు తాగకూడదు :
- యోగా చేసేటప్పుడు శరీరంలో ఉష్ణం క్రమంగా పెరుగుతుంది. అలాంటప్పుడు వెంటనే మీరు చల్లని నీరు తాగితే, ఉష్ణం హఠాత్తుగా పడిపోతుంది. దీనివల్ల అనేక ఇతర ప్రతి క్రియలు జరుగుతాయి. శ్లేష్మం, కఫం వంటి సమస్యల బారిన పడతారు. అలాగే సాధన సమయంలో బాత్ రూమ్ కూడా వెళ్ళవద్దు. ఎందుకంటే మీరు శరీరంలో నీటిని చెమట ద్వారా బయటికి పంపించాల్సి ఉంటుంది.
యోగా ముగిసిన వెంటనే తినకూడదు :
- ఖాళీ కడుపుతో యోగా చేయడం ఉత్తమం. అయినప్పటికీ, మీరు యోగా క్లాస్‌కు వెళ్లడానికి ఒక గంట లేదా రెండు గంటల ముందు తేలికగా ఏదైనా తినడానికి ప్రయత్నించాలి. ఇది మీ శక్తి స్థాయిలను, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.
- ఇక గర్భిణులు యోగా చేసేటప్పుడు ముందుగా అల్పాహారం తీసుకుంటే మంచిది. ఎందుకంటే, ఈ టైమ్‌లో మీకు తరచుగా ఆకలిగా అనిపిస్తుంది. కాబట్టి ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉంటే కళ్లు తిరగొచ్చు.
నొప్పులు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు యోగా చేయకూడదు:
- దూర ప్రయాణం కారణంగానో లేదా ఇంకా ఇతర కారణాలతో బాడీ పెయిన్స్ ఉంటే యోగా చేయకపోవడం మంచిది. దీని కారణంగా ఇంకా సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
యోగాకు ముందు వార్మప్ చేయడం మర్చిపోకండి :
- వ్యాయామం చేసే ముందు వార్మప్స్ చేయమని నిపుణులు చెబుతుంటారు. వార్మప్ ఎందుకు చేయాలి.? దీని వల్ల ఉపయోగాలు ఏంటి? అని చాలా మందికి తెలియదు.
- బాడీ ఫ్లెక్సిబుల్‌గా లేకుండా వ్యాయామాలు చేయడం కాస్త కష్టంగా ఉంటుంది. అందుకని ఎక్సర్‌సైజ్ చేయడానికి ముందే వార్మప్స్ చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. దీంతో ఎటువంటి వ్యాయామాలనైనా సులువుగా చేయవచ్చు. అలాకాకుండా డైరెక్ట్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తే తర్వాత కండరాల నొప్పి తీవ్రమవుతుంది.
Also Read: ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు!