మీ ఫోన్‌ డేటా చోరీ చేస్తున్న యాప్.. వెంటనే రిమూవ్ చేయండి!!

పాపులర్ ఆండ్రాయిడ్ యాప్ వినియోగదారులపై స్పైగా వర్క్ చేస్తోందని హెచ్చరిస్తున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు.

Update: 2023-05-31 11:34 GMT

దిశ, ఫీచర్స్: పాపులర్ ఆండ్రాయిడ్ యాప్ వినియోగదారులపై స్పైగా వర్క్ చేస్తోందని హెచ్చరిస్తున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. iRecorder అని పిలువబడే హానికరమైన యాప్ ఫైల్స్, వెబ్ ఇన్‌ఫర్మేషన్, ఫొటోస్‌ను కూడా దొంగిలిస్తున్నట్లు కనుగొన్న ఎక్స్‌పర్ట్స్..ప్రతీ 15 నిమిషాలకు మైక్రోఫోన్‌ను యూజ్ చేస్తూ ఆడియో స్నిప్పెట్ తీసుకుంటున్నట్లు తెలిపారు. వెంటనే ఈ యాప్‌ను ఫోన్ నుంచి రిమూవ్ చేయకపోతే.. డేటా చోరీతో పాటు కళ్లు, చెవులు దెబ్బతినే ప్రమాదం కూడా ఉందన్నారు.

ESET ద్వారా కనుగొనబడిన ఈ మాల్వేర్.. 2021లో ప్రారంభించినప్పుడు యాప్‌లో భాగంగా లేదు. కానీ ఏడాది తర్వాత వచ్చిన అప్‌డేట్‌లో ఈ హానికరమైన ఫీచర్స్ యాడ్ అయినట్లు గుర్తించారు. అయితే ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లోకి ప్రవేశించడానికి ప్రారంభ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం విశేషం. కానీ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేశారని.. లైవ్‌లో ఉన్నప్పుడు ఇన్‌స్టాల్ చేసినట్లయితే అన్‌ఇన్‌స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. ‘AhMyth’ అని పిలువబడే శక్తివంతమైన ఓపెన్ సోర్స్‌ టూల్‌ను ఉపయోగించే ఈ మాల్వేర్ వెనుక ఎవరున్నారనేది తెలియాల్సి ఉంది.

Read More:   వీడియో గేమ్స్ ఆడితే రూ.10 లక్షలు.. దరఖాస్తులను ఆహ్వానిస్తున్న కంపెనీ 

Tags:    

Similar News