Personal Health: రోజూ ఆ పని చేస్తే బలహీనపడిపోతారా?
Personal Health: రోజూ ఆ పని చేస్తే బలహీనపడిపోతారా?
దిశ,ఫీచర్స్: ‘‘జీవిత భాగస్వామితో ప్రతిరోజూ సన్నిహితంగా ఉంటున్నారా? ఆ పనిలో అతిగా నిమగ్నమైపోతున్నారా? అయితే త్వరగా బలహీనపడిపోతారు. ప్రొస్టేట్ క్యాన్సర్ కూడా రావచ్చు’’ పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఇప్పటికీ పలువురిలో నెలకొన్న అపోహలివి. హస్త ప్రయోగం చేసుకుంటే శృంగార సామర్థ్యం తగ్గుతందని, అలాగే శృంగారంలో ఎక్కువగా పాల్గొంటే శారీరకంగా బలహీన పడిపోతారని, ప్రొస్టేట్ క్యాన్సర్ వస్తుందని నమ్ముతుంటారు. కానీ అవన్నీ కేవలం అపోహ మాత్రమే అంటున్నారు మేరీల్యాండ్‌లోని బెథెస్డాలో(Bethesda) గల నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన వైద్య నిపుణులు.
వాస్తవానికి దంపతుల్లో శృంగారం ఆరోగ్యకరమైన విషయమని, అలాగే హస్త ప్రయోగం వల్ల కూడా హెల్త్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని వైద్య నిపుణులు చెప్తున్నారు. శృంగార కార్యకలాపాల వల్ల శారీరక బలహీనతలు రావని, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం అస్సలు లేదని పేర్కొంటున్నారు. పైగా పురుషుల్లో ఎక్కువసార్లు అంగస్తంభన జరగడంవల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గుతుందని చెప్తున్నారు. ఈ విషయమై 32 వేలమంది పురుషులను స్టడీ చేసిన ఆస్ట్రేలియాకు చెందిన వైద్య నిపుణులు పలు ఇంట్రెస్టింగ్ అంశాలను గుర్తించారు. నెలకు 7 నుంచి 8 సార్లు హస్త ప్రయోగం లేదా శృంగారం చేస్తున్నవారితో పోలిస్తే.. నెలలో 21 సార్లు ఆ పనుల్లో పాల్గొనేవారు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటున్నట్లు, పైగా వీరిలో ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు19 శాతానికి తగ్గినట్లు శాస్త్రవేత్త జెన్నీఫర్ రైడర్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం గుర్తించింది. గతం అధ్యయనాలు కూడా హస్త ప్రయోగం, శృంగారం ఆరోగ్యానికి మంచిదని పేర్కొన్నాయి.
* గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Read More..