మనిషి మనస్తత్వం తెలిపే మెడ..! మరి మీ మెడ ఎలాంటిదో తెలుసుకోండి..
కొంత మంది వ్యక్తులు మాట్లాడే మాటలను బట్టి, ప్రవర్తనను బట్టి వారి మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు.
దిశ, వెబ్ డెస్క్ : కొంత మంది వ్యక్తులు మాట్లాడే మాటలను బట్టి, ప్రవర్తనను బట్టి వారి మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు. మరి కొంత మంది మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోవాలి అనుకుంటే కొంత కాలం వారితో స్నేహం చేయడం, వారితో కలిసి ఉంటే తెలుసుకోవచ్చు. కానీ వ్యక్తి ముఖాన్ని చూసి, వారి చేతి రేఖలను బట్టి, శరీర ఆకృతిని బట్టి వారు ఎలాంటి వారో చెప్పవచ్చు అంటున్నారు కొంతమంది అధ్యయనకారులు. అయితే కొంతమంది మెడ పొట్టిగా, పొడవుగా, లావుగా, సన్నగా ఉంటాయి. ఈ మెడ పొడవును, మెడవంపును బట్టి ఎదుటి వారి వ్యక్తిత్వం, మనస్తత్వం ఎలాంటిదో చెప్పొచ్చు అంటున్నారు. మరి ఎలాంటి మెడ ఉన్న వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్న మెడ
కొంతమంది వ్యక్తుల మెడలు చిన్నగా, కురచగా ఉంటాయి. ఇలాంటి మెడవంపులు గల వారు స్నేహితుల మధ్య ఉన్న బంధానికి ఎక్కువగా విలువ ఇస్తారట. ఎదుటివారికి సమస్య వస్తే తమ సమస్యగా భావిస్తారట, అంతే కాదు సహాయం చేయడానికి వెనకాడకుండా ముందుకొస్తారట. ప్రతి ఒక్కరి దగ్గర విధేయులుగా నడుచుకుంటారట. మాట ఇస్తే తప్పకుండా ఆ మాటను నిలబెట్టుకుంటారట. అలాగే సమాజంలో జరిగే కొన్ని సంఘటనల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తారట. వారిని వారు సంరక్షుకోవడమే కాకుండా ఇతరుల కోసం సహాయంగా ఉండేందుకు ఇష్టపడతారట.
సాధారణ మెడ
కొంతమంది మెడ పొడవు, పొట్టి కాకుండా సాధారణంగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు ఏదైనా సమస్య వస్తే పరిష్కరించమే కాకుండా ఇతరుల సమస్యను పరిష్కరించడం గురించి ఆలోచిస్తారట. అలాగే శాంతి, సామరస్యానికి విలువ ఇస్తారు. అనవసరమైన గొడవలలో తల దూర్చకుండా దూరంగా ఉంటారట. అలాగే వారి జీవితాన్ని బ్యాలెన్స్ గా మెయింటైన్ చేయడానికి చూస్తారట. ఎదుటి వారిని ఇబ్బందులకు గురి చేయకుండా తమను తాము ఇబ్బందులకు గురి చేసుకుంటారట. దీంతో సమస్యల్లో చిక్కుకుంటుంటారట,
పొడవాటి మెడ
ఇక కొంతమంది మెడ చూస్తే చాలు పొడవుగా అందంగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు వారి సమస్యను వారే పరిష్కరించుకోగలరట. వీరు ఎవరిని అంత తేలిగ్గా నమ్మరట. ఎవరితోనూ అంత త్వరగా కలవకుండా రిజర్వుడుగా ఉంటారట. స్నేహితుల విషయంలో కూడా నిర్దిష్టమైన నమ్మకాలుంటాయని చెబుతున్నారు అధ్యయనకారులు. అలాగే వారి విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే అస్సలు నచ్చదట.