స్నానం చేస్తున్నప్పుడు యూరిన్ చేస్తున్నారా? కానీ ఎవరితో చెప్పుకోలేక పోతున్నారా?

చాలా మందికి స్నానం చేస్తున్నప్పుడు మూత్ర విసర్జన చేసే అలవాటు ఉంటుంది. కానీ ఎవరితో చెప్పుకోలేకపోతారు. ఇలా చేయడం వల్ల

Update: 2024-04-06 08:16 GMT

దిశ, ఫీచర్స్ : చాలా మందికి స్నానం చేస్తున్నప్పుడు మూత్ర విసర్జన చేసే అలవాటు ఉంటుంది. కానీ ఎవరితో చెప్పుకోలేకపోతారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందేమోనని భయపడిపోతుంటారు. కానీ సమాధానం వెతుక్కునే ప్రయత్నం చేయరు. అయితే ఈ విషయంపై జరిగిన పరిశోధనలు అలా చేయడం ఏ మాత్రం హానికరం కాదని చెప్తున్నాయి. నిజానికి యూరిన్‌లో ఉండే ఎలక్ట్రోలైట్స్ చర్మానికి ఎలాంటి అలెర్జీ, ఇన్‌ఫెక్షన్ కలిగించవని వెల్లడించాయి.

బ్యూటీ ప్రొడక్ట్స్‌లోనూ యూరిన్‌ను వివినియోగిస్తుంటారు. చర్మం నిగనిగలాడేందుకు.. మూత్రం తాగే వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అథ్లెట్స్ తమ పాదాల్లో ఫంగస్ రిమూవ్ చేసుకునేందుకు.. వాటిపై యూరిన్ చేస్తారని కూడా పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఇక నీటి కొరత ఉన్న దేశాల్లో కాళ్లు శుభ్రం చేసుకునేందుకు.. స్నానం చేసేటప్పుడు వాటర్ సేవ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తుంటారు.

అంతేకాదు బాడీ నుంచి వచ్చి వేస్టేజ్ అయిన చెమట, కఫం, పీరియడ్స్ బ్లడ్, మలం వంటివి కూడా యూరిన్ రూపంలో బయటకు వెళ్లపోతాయని హెల్త్ లైన్ చెప్తుంది. అందుకే స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేసేందుకు సంకోచించకూడదని.. ఇది హెల్తీ హ్యాబిట్ కిందకే వస్తుందని చెప్తున్నారు నిపుణులు.


Similar News