Parents with children : పిల్లలతో పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అనకూడని మాటలు ఏంటో తెలుసా..

సాధారణంగా ప్రతి తల్లి తండ్రులు తమ పిల్లలను ఎంతో గారాబంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు.

Update: 2024-08-29 05:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ప్రతి తల్లి తండ్రులు తమ పిల్లలను ఎంతో గారాబంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఏ చిన్న కష్టం రాకుండా కంటి పాపలా కాపాడుకుంటారు. అయితే కొన్ని సార్లు కోపంలో తెలియక పిల్లలను సూటిపోటి మాటలతో బాధపెడుతూ ఉంటారు. ఇలా బాధ పెట్టడం వల్ల మీరు తర్వాత ఎంత ప్రేమను చూపించిన కూడా ఆ మాటలు అనేవి మనస్సులో ఉండిపోతాయి. దీంతో మా పేరెంట్స్‌కు నేను ఇష్టం లేదు, ఇన్ని రోజులు ప్రేమ ఉన్నట్లు యాక్టింగ్ చేశారని భావిస్తారు. కాబట్టి ఎంత కోపం ఉన్నా కూడా పేరెంట్స్ పిల్లలతో ఈ మాటలు అనకూడదు. మరి ఎలాంటి మాటలు మాట్లాడకూడదో ఇప్పుడు మనం చూద్దాం..

1) ఇతరులతో పోల్చకూడదు..

తల్లిదండ్రులు చేసే బ్లండర్ మిస్టేక్ మన పిల్లలను ఇతరుల పిల్లలతో పోల్చడం. ఇంట్లో లేదా బయట చూసి వాళ్లలా నువ్వు ఎందుకు లేవు. అక్కను చూసి నేర్చుకో, తమ్ముడుని చూసి నేర్చుకో అని తల్లిదండ్రులు పదే పదే పోలుస్తారు. అసలు ఎవరి టాలెంట్ వారిదే. వేరేవాళ్లలా ఉండమని పిల్లలకు చెప్పొద్దు. మీరు మీలానే ఉండండి అని పిల్లలకు పేరెంట్స్ చెప్పాలి. అలా పోల్చడం వల్ల వారి కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది.

2) ఎందుకు నువ్వు అలా ఉన్నావు..

పిల్లలు అందంగా పుట్టక పోయిన, వాళ్ళు జీవితంలో ఏది సాధించకపోయినా కొంత మంది పేరెంట్స్ వారిని తక్కువ చేసి మాట్లాడతారు. అలాగే సన్నగా ఉన్నావు, లావుగా ఉన్నావు అంటూ తమ మాటలతో బాధపెడుతూ ఉంటారు. దీనివల్ల పిల్లలు తమ తల్లి తండ్రులే అలా అంటున్నారని బాధ పడుతూ డిప్రెషన్‌లోకి వెళ్లే ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి.

3) నువ్వు దేనికి పనికి రావు..

సహజంగా చాలామంది పేరెంట్స్ నోటి వెంట వచ్చే ఫస్ట్ వర్డ్ నువ్వు ఎందుకు పనికిరావు, నీకు ఏం రాదు. అలా అనడం చాలా తప్పు అలా అనడం వల్ల వారు డిప్రెషన్‌‌కి గురవుతారు. జీవితంలో ఏం సాధించలేమని కుంగిపోతారు. కాబట్టి నిజంగానే వారికి చేత కాక పోయినా నువ్వు చేయగలవు అంటూ పుష్ అప్స్ ఇస్తూ ఉండాలి.

4) నువ్వు నాకు పుట్టకపోయి ఉంటే బాగుండేది..

బేసిక్‌గా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే కొంత మంది పేరెంట్స్ ఈ మాట అంటుంటారు. నా కడుపున నువ్వు ఎందుకు పుట్టావు. ఆ రోజే చనిపోయి ఉంటే బాగుండేది. ఈ రోజు అంత బాధ ఉండకపోయేది అని మాటాలతోనే చంపేస్తారు. ఇలా కాకుండా పిల్లలతో ప్రేమగా మాట్లాడాలి. ఏ విషయం అయినా వారికి అర్థం అయ్యేలా చెప్పాలి. ఎంత కోపం వచ్చినా తమ పిల్లలను ఇలాంటి మాటలు అని బాధ పెట్టకూడదు.(కేవలం ఇంటర్నెట్ ద్వారా సేకరించినది మాత్రమే. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు)


Similar News