Parental Behavior : కాఠిన్యం వద్దు.. కరుణే ముద్దు.. పిల్లల్లో క్రియేటివిటీపై తల్లిదండ్రుల ప్రభావం!
Parental Behavior : కాఠిన్యం వద్దు.. కరుణే ముద్దు.. పిల్లల్లో క్రియేటివిటీపై తల్లిదండ్రుల ప్రభావం
దిశ, ఫీచర్స్ : కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను దారిలో పెట్టాలని చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారు. కానీ ఇది హద్దు మీరితే బెడిసి కొడుతుందని, క్రియేటివిటీని దెబ్బతీస్తుందని నిపుణులు చెప్తున్నారు. తరచుగా తిట్టడం, హెచ్చరించడం, బెదరించడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఇది వారి భావి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి పేరెంట్స్ పిల్లల విషయంలో మరీ కాఠిన్యం ప్రదర్శించవద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
తల్లిదండ్రులు కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటే క్రమంగా పిల్లలు అది నచ్చక తిరగబడటం నేర్చుకుంటారు. ఇది పెద్దయ్యాక ప్రతీ విషయంలో ప్రతికూల, తిరగబడే ఆలోచనలకు కారణం అయ్యే బిహేవియర్‌కు దారితీయవచ్చు. అదీగాకుండా పిల్లలపై తల్లిదండ్రుల నియంత్రణ, క్రమశిక్షణ పేరుతో వారిని ఎక్కువగా కట్టడి చేయడం వంటివి ప్రతికూల ప్రభావం చూపుతాయి. దీంతో పిల్లలు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం అయ్యే అవకాశం ఉంటుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాబట్టి పిల్లలకు నచ్చజెప్పడం, సాధారణ పద్ధతుల్లో హెచ్చరించడం, భయ పెట్టడం వంటివి చేయవచ్చు. కానీ క్రమ శిక్షణ పేరుతో మరీ కఠినంగా వ్యవహరిస్తే మాత్రం అది వారిలోని సృజనాత్మకతను దెబ్బతీయడమే కాకుండా, పలు ఇతర సమస్యలకు దారితీస్తుంది అంటున్నారు నిపుణులు. సో.. పేరెంట్స్ బీ కేర్ ఫుల్.
*గమనిక:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More..
ఈ 5 తెల్లటి పదార్థాలు తింటున్నారా.. వెంటనే గుడ్‌బై చెప్పేయండి!!