సినిమాల్లో క్యారెక్టర్స్‌తో ప్రేమ.. లిమిట్ క్రాస్ అయితే దిమ్మదిరిగే ట్విస్టులు

పారాసోషల్ రిలేషన్ షిప్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ బంధంలో మీడియాకు సంబంధించిన ఒక వ్యక్తి, పాత్ర లేదా వస్తువును

Update: 2024-06-09 12:11 GMT

దిశ, ఫీచర్స్ : పారాసోషల్ రిలేషన్ షిప్స్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ బంధంలో మీడియాకు సంబంధించిన ఒక వ్యక్తి, పాత్ర లేదా వస్తువును ఇష్టపడుతుంటారు. వెండితెర, బుల్లితెర, సోషల్ మీడియా.. ఇలా ఏదో ఒక మాధ్యమం ద్వారా కనెక్ట్ అవుతారు.

ఫిక్షనల్ క్యారెక్టర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్స్, సెలబ్రిటీలు, యానిమేటెడ్ క్యారెక్టర్స్ ను వన్ సైడ్ లవ్ చేస్తారు. రియాలిటీలో ఉంటూ ప్రేమిస్తుంటారు. వారిని ఇబ్బందికి గురి చేయకుండా.. వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించకుండా అలా చూస్తూనే తమలోనే ప్రేమను అనుభవిస్తూ మురిసిపోతారు. అందుకే ఈ రిలేషన్ ఎప్పటికీ ఆరోగ్యకరమైనదిగా చెప్తుంటారు నిపుణులు. ఇంతకీ దీనివల్ల ఎలాంటి లాభాలున్నాయి? నష్టాలు ఏమైనా ఉన్నాయా? తెలుసుకుందాం.

ఎలా స్టార్ట్ అవుతుంది?

నిజానికి ఇలాంటి బంధాలు విచిత్రంగా మొదలు అవుతాయి. ఒక సెలబ్రిటీ లేదా పాత్ర గురించి తెలుసుకున్నప్పుడు.. వారు తమలాంటి అలవాట్లు, పోలికలతోనే ఉన్నారని అర్థమైనప్పుడు ఆటోమేటిక్ గా ఇష్టం పుడుతుంది. వారి గురించి మరింత ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇందుకోసం వారికి సంబంధించిన ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పేజ్ లు ఫాలో కావడం చేస్తుంటారు.

ఆత్మ విశ్వాసం

ఒక వ్యక్తి తాను ప్రేమిస్తున్న క్యారెక్టర్ రియల్ లైఫ్ లో లేదని.. సెలబ్రిటీ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుందని గుర్తించినప్పుడు.. తన లిమిట్స్ లో తాను ఉన్నప్పుడు.. ఆ బంధం స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంటుంది. తన మీద తనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

లోన్లీనెస్ కు బైబై

జీవితంలో ఒక వ్యక్తిని లేదా వస్తువును ప్రేమించినప్పుడు.. లేదంటే ఒక పాత్రను ఇష్టపడినప్పుడు.. అవి మన కళ్లముందు ఉంటే చాలు అనుకున్నప్పుడు.. రోజూ కనిపిస్తున్నప్పుడు.. ఒంటరితనం అనేదే ఉండదు. లోన్లీనెస్ దరిచేరదు. పైగా ఆ వ్యక్తి మరింత ఉత్సాహంగా పని చేసుకోగలడు. పూర్తి విశ్వాసంతో ముందుకు సాగగలడు. తమకంటూ ఒకరు ఉన్నారనే భావంతో సంతోషంగా జీవించగలడు.

స్ట్రాంగ్ సోషల్ కనెక్షన్

పాపులర్ సెలబ్రిటీలు, ఫిక్షనల్ క్యారెక్టర్స్ కు తప్పకుండా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి అభిమానం ఉన్న తాము ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో అదే భావంతో ఉన్న మరో అభిమానిని కలవచ్చు. సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న తమ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడొచ్చు. ఈ విధంగా ఇద్దరు స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.


ప్రమాదకరమా?

పారాసోషల్ రిలేషన్ షిప్స్ నిజానికి ఆరోగ్యకరమైనవి. కానీ ఒక వ్యక్తి తాము రియాలిటీలో ఉండాలన్న విషయాన్ని మరిచి సెలబ్రిటీలను ఫాలో కావడం.. పోసేసివ్ నెస్ తో చేయరాని పనులు చేస్తేనే ప్రమాదం. అందుకే తాము ఒక సెలబ్రిటీని ఇష్టపడుతున్నాము కానీ తిరిగి వాళ్లు తమని ప్రేమించట్లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలా అయితేనే లైఫ్ నార్మల్ గా ఉంటుంది లేదంటే మలుపులు తిరుగుతూనే రోజుకో సినిమా చూపిస్తుంది.

ప్రతి బంధం ఒక వ్యక్తికి సామర్థ్యాన్ని ఇస్తుంది. నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది కూడా. వాటికి పారాసోషల్ రిలేషన్ షిప్స్ కూడా అతీతం కాదు. ఒకవేళ ఈ బంధం మీకు ఒత్తిడి కలిగిస్తే.. మానసికంగా డిస్టర్బ్ చేస్తే.. ఆత్మహత్య ఆలోచనలు కలిగిస్తే.. తప్పకుండా వైద్యుడి సహాయం తీసుకోవాల్సిందే. ట్రీట్మెంట్ తో ఈ పరిస్థితి సాధారణం అయిపోయింది అని చెప్తున్నారు నిపుణులు.


Similar News