రొమాన్స్‌కు ఓకే.. ఫొటోలకు నో..
మనసు బాగలేకపోయినా.. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేయాలనుకున్నా ప్రకృతి ఒడిలో వాలిపోతుంటాం.
దిశ, వెబ్‌డెస్క్ : మనసు బాగలేకపోయినా.. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేయాలనుకున్నా ప్రకృతి ఒడిలో వాలిపోతుంటాం. కానీ కాంక్రీట్ జంగిల్లో ప్రకృతి లేదు.. పరవశాలు లేవు.. ఉన్నవి కాస్తా కొద్దిపాటి పార్కులే. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వివిధ ప్రాంతాల్లో పార్కులను నిర్మించి పచ్చిక బయళ్లు.. చెట్లు, పూల మొక్కలను నాటి కాస్తా ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించింది. అయితే పార్కుల్లోకి ఎంట్రీ టికెట్ పెట్టి మరి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లోపలికి పంపిస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. పార్కుల్లో ప్రకృతితో ఫొటోలు తీయడానికి అనుమతించడం లేదు. దీంతో ప్రకృతి ప్రేమికులు నిరాశ చెందుతున్నారు.
హైదరాబాద్ నగర పరిధిలో హెచ్ఎండీఏ అధికారులు వింత పోకడ పోతున్నారు. పార్కుల్లోకి ఎంట్రీ ఇస్తున్నా.. వాటిల్లో ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. కుటుంబ సమేతంగా వెళ్లిన ఫ్యామిలీలు సరదాగా ఫొటోలు తీసుకోవాలన్నా, బర్త్ డేలు, వెడ్డింగ్ ఫొటో షూట్స్ చేసుకోవాలన్నా అనుమతించడం లేదు. కనీసం కెమెరా బ్యాగ్ కనిపించినా.. పార్క్‌లోకి ఎంట్రీ ఇవ్వడం లేదు. దీంతో పచ్చదనంలో ఫొటోలు తీసుకోవాలన్న వారికి నిరాశే ఎదురువుతోంది.
కానీ కొన్ని లవర్స్ జంటలు పార్కుల్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా పట్టించుకోవడం లేదు. పార్క్‌కు ఫ్యామిలీస్, చిన్న పిల్లలతో వచ్చిన వారు ఆ జంటల చేష్టలకు ఖంగుతింటున్నారు. చుట్టూ జనం ఉన్నా.. అవేమీ పట్టించుకోకుండా హగ్గులు, ముద్దులతో పాటు కాస్తా చెట్టు పొద చాటు దొరికితే చాలు.. సెక్స్‌కు కూడా సిద్ధపడిపోతున్నారు. పార్కుల్లో ఫొటోలు తీసుకోవడానికి అనుమతించని జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది మరి.. శృంగారానికి ఎలా అనుమతి ఇస్తున్నారని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. పార్కుల్లో కెమెరాలను చూస్తే వెంటనే సిబ్బంది వచ్చి దౌర్జన్యంగా లాక్కెళ్తున్నారని, కనీసం పార్క్ ఎదుట కెమెరాలను అనుమతి లేదన్న బోర్డులు కూడా పెట్టకుండా లోపలికి వెళ్లాక దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. హెచ్ఎండీఏ అధికారుల తీరు 'సెక్స్‌కు ఓకే.. ఫొటోలకు నో..' అనే తీరుగా ఉందని తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
వధువుతో ఆ పని చేయడానికి సంతకం చేపించుకున్న వరుడి స్నేహితులు..