Bad smell in clothes : వర్షాకాలంలో బట్టల్లో దుర్వాసన.. ఈ చిట్కాలతో పోగొట్టవచ్చు!
అసలే వర్షాకాలం.. తరచుగా కురిసే వానలతో వాతావరణంలో తేమ అధికంగా ఉంటోంది. దీంతో ఉతికిన బట్టలు ఆరకపోవడం, ఆరినా వాటిలో ఓ విధమైన దుర్వాసన రావడం జరుగుతుంటాయి.
దిశ, ఫీచర్స్ : అసలే వర్షాకాలం.. తరచుగా కురిసే వానలతో వాతావరణంలో తేమ అధికంగా ఉంటోంది. దీంతో ఉతికిన బట్టలు ఆరకపోవడం, ఆరినా వాటిలో ఓ విధమైన దుర్వాసన రావడం జరుగుతుంటాయి. ముఖ్యంగా టవల్స్, బెడ్‌షీట్లలో ఇది ఎక్కువగా వస్తుంది. అలాంటప్పుడు బ్యాడ్ స్మెల్ పోగొట్టడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
* బేకింగ్ సోడా యూజ్ చేయండి : దుర్వాసనను పోగొట్టడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి వర్షాకాలంలో టవల్స్, బెడ్‌షీట్స్ ఉతికే ముందు నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో కలపండి. దీంతో ఉతికిన తర్వాత దుర్వాసన రాకుండా ఉంటాయి.
* రెగ్యులర్‌గా ఐరన్ చేయడం : ఉతికిన టవల్స్, బెడ్‌షీట్స్ దుర్వాసన రాకుండా ఉండాలంటే మరో ముఖ్యమైన చిట్కా వాటిని ఇస్త్రీ చేసి పెట్టడం. వానాకాలంలో చాలామంది దీనిని పాటిస్తుంటారు. ఫలితంగా బట్టలు తాజాగా ఉంటాయి.
*వెలుతురు ముఖ్యం : ఎప్పుడూ కిటికీలు, తలుపులు మూసి ఉంచడంవల్ల టవల్స్, బెడ్‌షీట్లలో దుర్వాసన వెదజల్లే అవకాశం ఎక్కువ. తేమ ఆరకపోవడం ఇందుకు కారణం అవుతుంది. కాబట్టి పగటిపూట వెలుతురు వచ్చేలా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచితే దుర్వాసన రాకుండా ఉంటుంది.
* వెనిగర్ : వెనిగర్ కూడా బేకింగ్ సోడాలాగే బట్టలు ఉతికేముందు యూజ్ చేయాలి. దీంతో అవి దుర్వాసన రాకుండా ఉంటాయి. మరొక విషయం ఏంటంటే.. వర్షాకాలం తేమ ఆరకపోవడంవల్లే టవల్స్, బెడ్ షీట్స్ బ్యాడ్ స్మెల్ వస్తుంటాయి. కాబట్టి బాగా ఆరబెట్టడం కూడా ముఖ్యం. వర్షం పడుతుంటే ఇంట్లో అయినా సరే గాలి తగిలే విధంగా ఓ తాడుపైనో, స్టాండ్‌పైనో ఆరబెట్టాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.