Fennel seeds: భోజనం తర్వాతే కాదు.. ఎప్పుడైనా తినవచ్చు..!
దాదాపుగా ప్రతీ ఒక్కరికి దీని గురించి తెలిసే ఉంటుంది. హాటల్‌కి వెళితే కచ్చితంగా భోజనం తర్వాత దీనిని మనకు ఇస్తారు.
దిశ, ఫీచర్స్: దాదాపుగా ప్రతీ ఒక్కరికి దీని గురించి తెలిసే ఉంటుంది. హాటల్‌కి వెళితే కచ్చితంగా భోజనం తర్వాత దీనిని మనకు ఇస్తారు. అదేనండి సోంపు. భోజనం తరువాత దీనిని తినకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఇది నోటికి తాజా పరిమళం ఇవ్వడమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఈ సోంపు అందిస్తుంది. అయితే, దీనిని కేవలం భోజనం తిన్న తర్వాతే తినాలి అనుకుంటే పొరపాటే. దీనిని ఎప్పుడైనా తినవచ్చు. దీనిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
భారతీయ వంటకాల్లో సోంపుని వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. ఇందులో కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. సాధారణంగా భోజనం తర్వాత అరుగుదల కోసం దీనిని తింటారు. కానీ, టిఫిన్, భోజనానికి మధ్య కొంచెం ఈ సోంపును తినడం వల్ల సాధారణంగా తినే దానికంటే కొంచెం తక్కువగా తింటారని నిపుణులు చెబుతున్నారు. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే సోంపు తిన్న తరువాత కడుపు నిండిపోయిన ఫీలింగ్ కలిగి తక్కువగా తింటారు.
* ప్రతీ రోజూ మాములూ టీ కాకుండా సోంపుతో చేసిన టీ తాగడం వల్ల మూత్ర సమస్యలు తగ్గుతాయి. వారంలో ఒక్కసారి అయినా సోంపుతో చేసిన టీని తాగడం మంచిది. ఇది శరీరంలోని వ్యర్థాలను కూడా తొలగిస్తుంది.
* సోంపు అనేక జీర్ణ సమస్యల నుండి బయటపడడానికి ఇది సహాయపడుతుంది. ఉదయం టైమ్‌లో దీనిని తినడం వల్ల మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
* చాలామంది ఎముకల సమస్యలతో బాధపడుతుంటారు. ఉదయం పూట నీళ్లతో కానీ, డైరెట్‌గా వీటిని తినడం వల్ల ఎముకలకు బలం వస్తుంది. సోంపులో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది.
* దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తన్ని శుద్ధిచేయడంలో తోడ్పడుతాయి.
* అలసట లేకుండా మంచిగా నిద్ర పట్టాలంటే ఈ సోంపు గింజలు ఉపయోగపడతాయి. ప్రతీ రోజూ భోజనం తర్వాత వీటిని తినడం వల్ల రాత్రి హాయిగా నిద్రపోయి, ఉదయాన్నే చురుగ్గా పనిచేస్తారు.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.