గాల్ బ్లాడర్ లో రాళ్ల సమస్య ఉందా.. శస్త్రచికిత్స లేకుండా ఇలా తొలగించుకోండి..

చాలామందిలో రాళ్ల సమస్య చాలా సాధారణంగా వస్తుంటుంది. చెడు ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీలో గాల్ బ్లాడర్ లో రాళ్లు వస్తుంటాయి.

Update: 2024-10-10 03:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : చాలామందిలో రాళ్ల సమస్య చాలా సాధారణంగా వస్తుంటుంది. చెడు ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీలో గాల్ బ్లాడర్ లో రాళ్లు వస్తుంటాయి. టమోటా, బెండకాయ, దోసకాయ, బచ్చలికూర వంటి ఎక్కువ గింజలు ఉన్న కూరగాయలను తినడం వల్ల రాళ్ల సమస్య వస్తుందంటున్నారు వైద్యనిపుణులు. కాలిక్యులస్ అనేది మురికి నుండి ఏర్పడిన రాయి వంటి వ్యర్థ పదార్థం. దీని పరిమాణం ఎంతైనా ఉండవచ్చు కానీ ఆ రాళ్ల ఆకారం షార్ప్ గా ఉంటాయంటున్నారు నిపుణులు. అందుకే స్టోన్స్ బారిన పడిన వ్యక్తులు రాళ్ల కారణంగా అతిగా నొప్పిని అనుభవిస్తారు. కిడ్నీ రాళ్ళు శరీరంలోని రెండు ప్రదేశాలలో కనిపిస్తాయి. అవి మూత్రపిండాలు, పిత్తాశయం. వీటిని గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటారు.

కిడ్నీలో రాళ్ల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మూత్రపిండ రాళ్లను తొలగించవచ్చు. అయితే పిత్తాశయంలో రాళ్లు వాటంతట అవే బయటకు అస్సలు రావు. అందుకే దీన్ని తొలగించాలంటే సర్జరీ అవసరమే కానీ.. శస్త్ర చికిత్స లేకుండానే సహజంగా శరీరంలోని గాల్ బ్లాడర్ స్టోన్స్ ను కూడా తొలగించవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.

నిపుణుల అభిప్రాయం..

నిపుణుల అభిప్రాయం ప్రకారం పిత్తాశయం రాళ్లతో బాధపడుతున్న వ్యక్తి స్పైసీ ఫుడ్ తినకూడదు. శారీరకంగా యాక్టివ్ గా ఉండాలి, కొన్ని యోగాసనాలు కూడా రాళ్లను తొలగించడంలో సహాయపడతాయంటున్నారు నిపుణులు. పిత్తాశయంలోని రాళ్లను కోలిలిథియాసిస్ అంటారు. అది పెద్ద పరిమాణంలో ఉంటే అవి వ్యక్తిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఆ బాధ భరించలేనిది. అందుకే వాటిని తొలగించడం చాలా ముఖ్యం. సరైన ఆహారంతో పిత్తాశయంలోని రాళ్లను కూడా తొలగించవచ్చంటున్నారు నిపుణులు.

శస్త్రచికిత్స లేకుండానే రాళ్ల తొలగింపు..

ఆయుర్వేద వైద్యనిపుణుల ప్రకారం తక్కువ సందర్భాల్లో వ్యక్తికి నిర్దిష్ట జీవక్రియ రుగ్మతలు లేకుంటే, శస్త్రచికిత్స లేకుండా గాల్ బ్లాడర్ రాళ్లను తొలగించుకోవడం సాధ్యమవుతుంది. సరైన ఆహారం, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా శస్త్రచికిత్స అవసరం లేకుండా చాలా వరకు నివారించవచుకోవచ్చంటున్నారు. దీని కోసం, తక్కువ స్పైసీ ఫుడ్, సాత్విక ఆహారం, శారీరకంగా యాక్టివ్ గా ఉండటం, నిద్ర సరైన సమయంలో పోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. అలాగే రాళ్లను బయటకు తీయడంలో సహాయపడే అనేక ఆహారాలు ఉన్నాయి. ఇందులో యాపిల్ వెనిగర్ చాలా మేలు చేస్తుంది. వాస్తవానికి కోలిలిథియాసిస్‌కు ప్రధాన కారణం హైపోక్లోరోహైడ్రియా. అందుకే ఆపిల్ సైడర్ వెనిగర్ దానిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఆపిల్ వెనిగర్ ప్రయోజనాలు..

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆపిల్ వెనిగర్‌తో పిత్తాశయం రాళ్లను శరీరం నుండి సులభంగా తొలగించవచ్చు. మీరు దీన్ని ప్రతిరోజూ ఒకటి నుండి రెండు స్పూన్లు తీసుకోవచ్చు. అదేవిధంగా పైనాపిల్ పిత్తాశయ రాళ్ల పై ప్రభావం చూపిస్తుంది. దీని వినియోగం బర్నింగ్ సెన్సేషన్, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనితో పాటు స్టోన్స్ ఉన్న రోగి వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. కానీ రాయి పరిమాణం పెరిగినట్లయితే ఆలస్యం

 * గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News