Nocturnal anxiety: కొందరికి రాత్రిపూట మాత్రమే ఆందోళన పెరిగిపోతుంది.. కారణం ఇదే !

Nocturnal anxiety: కొందరికి రాత్రిపూట మాత్రమే ఆందోళన పెరిగిపోతుంది.. కారణం ఇదే !

Update: 2024-10-04 13:18 GMT

దిశ, ఫీచర్స్ : అది ఏ సమస్య అయినా సరే.. దాని తాలూకు బాధలను చాలా మంది వ్యక్తులు రాత్రిపూట పడుకునే ముందు లేదా మధ్యలో నిద్రమేల్కొన్నప్పుడు ఫీల్ అవుతుంటారు. ముఖ్యంగా యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి రుగ్మతలు రాత్రిళ్లు మరింత ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. అయితే ఇందుకు ప్రత్యేక కారణం ఉందంటున్నారు మానసిక నిపుణులు. ఏంటంటే.. సంతోషాలైనా, బాధలైనా ప్రశాంతంగా ఫీలయ్యేందుకు రాత్రి సమయంలోనే విశ్రాంతి ఎక్కువగా దొరుకుతుంది. పైగా దృష్టి మరల్చలేని ఆందోళన కలిగించే విషయాలు ఒక్కసారిగా గుర్తుకురావడం వల్ల కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఓ వైపు ఆందోళన, దానిని ఎదుర్కొనేందుకు అవసరమైన హార్మోన్ల మధ్య ఏర్పడే రసాయనిక చర్యలు, మానసిక సంఘర్షణకు దారితీస్తాయి. దీంతో రాత్రిపూట ఆందోళన మరింత పెరిగిపోతుంది అంటున్నారు నిపుణులు.

మీరు ప్రశంతంగా నిద్రపోదాం అనుకుంటారు. కానీ బెడ్‌పై వాలగానే కొంత కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తుకు వస్తాయి. అప్పులు, తగాదాలు, అనారోగ్యాలు, ఇతరులతో, సామాజిక పరిస్థితుల్లో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఆలోచనల రూపంలో వెంటాడుతుంటాయి. దీంతో ఆందోళన పెరిగిపోతుంది. ఆ సమయంలో గుండె వేగం సాధారణంకంటే పెరగడం, కండరాలు బిగుసుకుపోయిన అనుభూతి కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా కూడా అనిపించవచ్చు. నుదుటిపైన, అరచేతుల్లో చెమటలు పడుతుంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే మీరు రాత్రి ఆందోళనతో బాధపడుతున్నట్లు గుర్తించి అలర్ట్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. వారానికి మించి ఈ విధమైన ఆందోళనతో మిమ్మల్ని వేధిస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మానసిక వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

*గమనిక:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించడం లేదు. మీ అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే మానసిక నిపుణులను సంప్రదించగలరు. 


Similar News