తుపాకీ బుల్లెట్‌ను ఆపగలిగే సరికొత్త శరీర కవచం..!
ధ్వనివేగంతో ప్రయాణించే బుల్లెట్స్‌ను ఆపగలిగే సరికొత్త శరీర కవచాన్ని అభివృద్ధి చేశారు బ్రిటన్ శాస్త్రవేత్తలు.
దిశ, ఫీచర్స్: ధ్వనివేగంతో ప్రయాణించే బుల్లెట్స్‌ను ఆపగలిగే సరికొత్త శరీర కవచాన్ని అభివృద్ధి చేశారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. ఈ మెటీరియల్ బుల్లెట్ నుంచి కేవలం మానవ ప్రాణాలను కాపాడటానికి సహాయపడటమే కాదు ఎగిరే శిథిలాల నుంచి విమానం, అంతరిక్ష నౌకలను రక్షించడంలోనూ సహాయపడుతుంది. ఈ సూట్‌లో 'టాలిన్' అని పిలువబడే మానవ కణాలలో కనిపించే ప్రోటీన్ ఉంటుంది. బాహ్య శక్తులను రీఫార్మ్ చేసే ఈ ప్రొటీన్‌కు ఏదైనా తగిలితే.. ఆ ప్రభావాన్ని వేడిగా మార్చడానికి బదులుగా అన్‌ఫోల్డ్ చేస్తుంది.
ఎక్స్‌పరిమెంట్ సమయంలో.. అల్యూమినియం ప్లేట్ ముందు ఉంచిన ఈ శాంపిల్.. సెకన్‌కు మైలు సూపర్‌సోనిక్ వేగంతో దూసుకొచ్చిన బుల్లెట్లను ఆపగలిగినట్లు నిర్ధారించారు శాస్త్రవేత్తలు. తుపాకీ బుల్లెట్ల సామర్థ్యం రెండింతలున్నా.. జెల్ వాటిని కదలకుండా ఆపగలిగిందని తెలిపారు. కెంట్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రాజెక్ట్ లీడర్ ప్రొఫెసర్ బెంజమిన్ గౌల్ట్..' టాలిన్ అనేది కణాల నేచురల్ షాక్ అబ్జార్బర్. ఇది బైనరీ స్విచ్ డొమైన్‌ల శ్రేణిని కలిగి ఉంటుంది. ఇవి టెన్షన్‌లో తెరుచుకుంటాయి, టెన్షన్ తగ్గిన తర్వాత మళ్లీ మళ్లించబడతాయి. బలానికి ఈ ప్రతిస్పందన టాలిన్‌కు అద్భుతమైన లక్షణాలను ఇస్తుంది. పెద్ద శక్తి మార్పుల ప్రభావాల నుంచి మన కణాలను రక్షిస్తుంది. ఇది ఒక తేలికపాటి.. మన్నికైన కవచం. షాక్ ద్వారా వచ్చిన వాటితో సహా విస్తృత వర్ణపట గాయాల నుంచి రక్షణ కల్పిస్తుంది' అని తెలిపారు.
చాలా తేలికగా ఉన్నప్పుడు వస్తువులను ఆపడంలో సెటప్ గొప్పగా ఉన్నప్పటికీ.. గతి శక్తికి వ్యతిరేకంగా ఇది అంత ప్రభావవంతంగా ఉండదు. దీని ఫలితంగా షీల్డ్ కింద శరీరానికి గాయం అవుతుంది. దాని నిర్మాణ సమగ్రత పడిపోతుంది. కాబట్టి ఇది నిరంతర వినియోగానికి పనికిరానిదని చెప్తున్నారు విశ్లేషకులు.
READ MORE
టిక్‌టాక్‌తో టీనేజర్స్‌కు రిస్క్.. సూసైడ్ చేసుకునే అవకాశం: పరిశోధకులు