అంత్యక్రియలకు కండోమ్స్ పట్టుకెళ్తున్న పురుషులు.. ఎక్కడా తగ్గేదెలే..!

సన్నిహిత వ్యక్తి మరణిస్తే అంత్యక్రియలకు హాజరవడాన్ని బాధ్యతగా ఫీలవుతుంటారు. కడచూపు చూసేందుకు ఎంతదూరమైనా సరే వెళ్తారు.

Update: 2023-05-31 11:00 GMT

దిశ, ఫీచర్స్: సన్నిహిత వ్యక్తి మరణిస్తే అంత్యక్రియలకు హాజరవడాన్ని బాధ్యతగా ఫీలవుతుంటారు. కడచూపు చూసేందుకు ఎంతదూరమైనా సరే వెళ్తారు. దగ్గరుండి మరీ అన్ని పనులు చూసుకుంటారు. డియరెస్ట్ పర్సన్‌కు దు:ఖిస్తూనే తుది వీడ్కోలు పలుకుతారు. అయితే ఇదంతా పైకి కనిపించే కథ అని.. ఫ్యునెరల్స్‌కు అటెండ్ అయినప్పుడు ప్రతీ ఎనిమిది మంది పురుషుల్లో ఒకరు కండోమ్ వెంట తీసుకెళ్తారని తాజా అధ్యయనం తెలిపింది. యూఎస్ కండోమ్ బ్రాండ్ ట్రోజన్ సరికొత్త పరిశోధనల్లో ఈ ఫలితం వెలువడింది.

18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల 2,000 మంది అడల్ట్స్‌ను ప్రశ్నించిన ట్రోజన్ స్టేట్ ఆఫ్ సెక్స్ సర్వేలో ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ వచ్చాయి. హైస్కూల్ రీయూనియన్‌లో నలుగురు మిలీనియల్స్‌లో ఒకరు సేఫ్టీ తీసుకెళ్తున్నారని చెప్పింది. 65శాతం మంది ఫస్ట్ డేట్‌కు కండోమ్‌ను తప్పనిసరిగా కొనుగోలు చేస్తున్నారని వివరించింది. మొత్తానికి ఈ న్యూస్ నెట్టింట వైరల్ కాగా నిజంగా ఆశ్చర్యంగా ఉందని కొందరు అంటుంటే.. అందులో తప్పేముందని మరికొందరు సమర్థిస్తున్నారు. 

Tags:    

Similar News