సూసైడ్ థాట్స్‌ను ముందే గుర్తిస్తున్న ఏఐ.. ఎలాగో తెలుసా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ (AI) కౌమార దశలో ఉన్నప్పుడు కలిగే సూసై అండ్ సెల్ఫ్ హార్మ్ థాట్స్‌ ప్రమాదాన్ని ముందే అంచనా వేయగలదని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

Update: 2023-09-04 05:43 GMT

దిశ, ఫీచర్స్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ (AI) కౌమార దశలో ఉన్నప్పుడు కలిగే సూసై అండ్ సెల్ఫ్ హార్మ్ థాట్స్‌ ప్రమాదాన్ని ముందే అంచనా వేయగలదని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అందుకోసం యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సిడ్నీ నేతృత్వంలోని పరిశోధకులు న్యూ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్‌ను ఉపయోగించారు. ఇప్పటికే ఉన్న ఏఐ రిస్క్ ప్రిడిక్టర్లకంటే ఈ లేటెస్ట్ మోడల్స్ కచ్చితమైన అంచనాలను అందించగలుగుతాయని, పేషెంట్ల మానసి స్థితిని గుర్తించి హెచ్చరిస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.

స్టడీలో భాగంగా 2,809 మంది యుక్త వయస్కులకు సంబంధించిన డేటాను రీసెర్చర్స్ ‘లాంగిట్యూడినల్ స్టడీ ఆఫ్ ఆస్ట్రేలియన్ చిల్డ్రన్ (LSAC)’ సంస్థ నుంచి సేకరించారు. ఇందులో 14 నుంచి 15 ఏళ్లు, అలాగే 17 నుంచి 17 ఏళ్ల వయస్సుగల వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఆ తర్వాత వారి సంరక్షకులు, స్కూల్ టీచర్స్ పూర్తి చేసిన పిల్లల మానసిక ధోరణుల డేటాను కూడా ఎనలైజ్ చేశారు. తర్వాత న్యూ ఏఐ ర్యాండమ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్‌ను యూజ్ చేస్తూ సదరు స్టూడెంట్స్ ఆలోచనలను రాబట్టారు. కాగా ఇందులో 10.5 శాతం మది తాము స్వీయ హాని చర్యను కలిగి ఉన్నట్లు నివేదించారు. 5.2 శాతం మంది గడిచిన 12 నెలల కాలంలో కనీసం ఒక్కసారైనా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు స్పష్టం చేశారు. దీనిని బట్టి ఏఐ న్యూ రాండమ్ ఆల్గారిథమ్ మోడల్స్ కచ్చితమైన సమాచారాన్ని అంచనా వేస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. 

Read More:    ప్రతిరోజు స్నానం చేస్తున్నారా? చేయకపోతేనే బోలెడు లాభాలు : నిపుణులు 

Tags:    

Similar News