సూర్యుడికి అతి దగ్గరగా దూసుకెళ్లిన నాసా సోలార్ ప్రోబ్.. సౌర తుఫానులు దాటుకుంటూ..

నాసా సైంటిస్టుల అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లో మరో కీల‌క ఘ‌ట్టం చోటు చేసుకుంది

Update: 2023-09-22 07:34 GMT

దిశ, ఫీచర్స్: నాసా సైంటిస్టుల అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లో మరో కీల‌క ఘ‌ట్టం చోటు చేసుకుంది. అత్యంత వేడి ఉష్ణోగ్రతలతో మండుతున్న సూర్యుడి చుట్టూ ఉండే క‌రోనా వ‌ల‌యంలోకి మొట్ట మొదటిసారిగా మానవుడు త‌యారు చేసిన ఒక వ‌స్తువు దూసుకెళ్లింది. అదే నాసా పంపిన పార్కర్ సోలార్ బ్రోబ్ (Parkar Solar Probe). 2018లో ప్రయోగించిన ఈ ఉపగ్రహం సూర్యుడికి అత్యంత ద‌గ్గరకు వెళ్లిన ఒక మాన‌వ నిర్మిత వ‌స్తువుగా హిస్టరీలో నిలిచిపోయిందని నిపుణులు చెప్తున్నారు. సూర్యుడికి కేవ‌లం 90 ల‌క్షల కి.మీ. దూరంలో ఏర్పడిన ఒక సౌర తుఫానులో ఇది రెండు రోజులు జర్నీ చేసిందని నాసా తన ఎక్స్‌(ట్విట్టర్ ) వేదికగా వెల్లడించింది. ఇది మానవులకు చాలా దూరంగా అనిపించినప్పటికీ స్పేస్ స్కేల్ ప్రకారం త‌క్కువ దూర‌ంగానే పరిగణిస్తారట. ఉదాహ‌ర‌ణ‌కు సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్న మెర్క్యురీ 3 కోట్ల కి.మీ. దూరంలో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అదే భూమిని పరిగణిస్తే గనుక సుమారు 15 కోట్ల కి.మీ దూరంలో పరిభ్రమిస్తుంది. ఈ నెల‌లోనే కొన్ని రోజుల కిందట క‌రోనల్ మాస్ ఎజిక్షన్ (సీఎంఈ) ప్రాంతంలో పార్కర్ ప్రయాణించింది.

పార్కర్ బ్రోబ్ అద్భుత ప్రయాణానికి సంబంధించిన వీడియోను నాసా సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాస్తవానికి ఎజిక్షన్ అనేది సూర్యుడి నుంచి వెలువ‌డే ప్లాస్మా ఉండే ఏరియా. ఇక్కడే క‌రోనా వ‌ల‌యాలు ఉంటాయి. సూర్యుడి ఉప‌రిత‌లం మీదికంటే ఇక్కడే ఎక్కువ‌గా ఉష్ణోగ్రతలు ఉంటాయని సైంటిస్టులకు ఇప్పటి వరకు అంతు చిక్కలేదు. ఈ విష‌యం క‌నుక్కోవ‌డానికి, సూర్యుడి ఆవిర్భావాన్ని అంచ‌నా వేయ‌డానికి పార్కర్ ప్రయత్నిస్తోందని పరిశోధకులు వెల్లడించారు. ఎజిక్షన్ అనేది సౌర తుఫాను ఏర్పడినప్పుడు ఉత్తేజితంగా మారుతుంది. ఇది భూమి ఉన్న ద‌శ‌లో ఏర్పడితే మ‌న స‌మాచార వ్యవస్థ విఫ‌లం చెందుతుందని చెప్తున్నారు. అప్పుడ‌ప్పుడూ సోలార్ తుఫానులు వ‌చ్చినా తీవ్రత త‌క్కువ ఉంటే మ‌న భూ అయ‌స్కాంత వ‌ల‌యం వాటి నుంచి ర‌క్షిస్తుంది. ప్రజెంట్ పార్కర్ క‌నుగొన్న దాని ప్రకారం.. ఈ సీఎంఈ ప్రాంతంలో అణువులు సెక‌నుకు 1350 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. పార్కర్ తాజాగా జర్నీ చేసిన సౌర తుఫాను సూర్యుడికి అవతల జ‌రిగిందని, అదే మ‌న వైపు జ‌రిగి ఉంటే భారీ న‌ష్టం సంభ‌వించి ఉండేదని నాసా పేర్కొన్నది.

Tags:    

Similar News