ఒంటరిగా ఉంటే అలా ఉండాలని నా భార్య ఫోర్స్ చేస్తోంది.. పేరెంట్స్‌ను కూడా ఉండనివ్వట్లే..

పెళ్లి అనేది రెండు జీవితాల కలియక చాలా మంది పెళ్లి తర్వాత ఒంటరిగా, తమ భర్తతో మాత్రమే గడపాలని కోరుకుంటారు. మరి కొందరు ఫ్యామిలీతో ఉండాలని ఆశపడుతారు.

Update: 2023-03-18 08:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అనేది రెండు జీవితాల కలియక చాలా మంది పెళ్లి తర్వాత ఒంటరిగా, తమ భర్తతో మాత్రమే గడపాలని కోరుకుంటారు. మరి కొందరు ఫ్యామిలీతో ఉండాలని ఆశపడుతారు. అయితే అలానే ఓ జంట పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొన్ని రోజులకు కోడలు వేరే కాపురం వైపు మొగ్గుచూపుతుంది. రోజు ఇంట్లో భర్తను వేధిస్తుంది. అతనికేమ తల్లిదండ్రులను వదిలి పెట్టి పోవడం ఇష్టం లేదు. దీంతో ఆయన తన తల్లిదండ్రుల వైపు ఉంటాడో లేక భార్య చెప్పిన మాట వింటాడో ఇప్పుడు చూద్దాం.

భర్త మాట్లాడుతూ.. నాకు పెళ్లై కొన్ని రోజులు మాత్రమే అవుతుంది, నా భార్య నన్ను రోజూ వేరే కాపురం పెడుదాం అంటూ టార్చర్ చేస్తుంది. మళ్లీ ఇంట్లోవాళ్లతో బానే ఉంటుంది. నేను ఒంటరిగా ఉన్న సమయంలో నన్ను వేధిస్తుంది. ఆమె ప్రవర్తన రోజు రోజుకు చాలా మారిపోతుంది.ఆమె డబుల్ స్టాండర్స్ నాకు అర్థమవుత లేదు. నాకేమో నా తల్లిదండ్రులను విడిచి పెట్టి ఎక్కడికీ వెళ్లాలని లేదు, నా భార్యనేమో నన్ను అర్థం చేసుకుంటలేదు సర్.. దీనికి మీరేమైన పరిష్కారం చూపిస్తారా అంటూ,హోప్ కేర్ ఇండియాలో క్లినికల్ సైకాలజిస్ట్ ఒమికా ఒబెరాయ్ అడిగారు.

దీనికి ఆయన సమాధానం చెబుతూ..ఈరోజుల్లో తల్లిదండ్రులతో కాకుండా భార్య భర్తలు విడిగా ఉండటం చాలా కామన్. దీన్ని చాలా మంది ఇష్టపడుతున్నారు.దీన్ని చాలా మంది ఇష్టపడుతున్నారు కూడా. ఎందుకంటే.. దీనివల్ల కుటుంబ సభ్యుల స్వేచ్ఛకు భంగం కలగట్లేదు, ఫ్యామిలీలో గొడవలు కూడా తగ్గుతున్నాయి. కానీ భార్య మిమ్ముల్ని ఎక్కువగా ఫోర్స్ చేస్తుంది.మీరు మీ తల్లి దండ్రుల మధ్య మీ భార్యతో నలిగిపోతున్నారని అర్థం అవుతుంది. మీరు మీ భార్యతో ఒకసారి ప్రేమగా మాట్లాడండి. మీ తల్లిదండ్రులను వదిలి రావడం తనకు ఇష్టం లేదని అర్థమయ్యేల చెప్పండి అప్పుడు మీ ప్రాబ్లం సాల్వ అవుతుంది, మీరు మీ ఫ్యామిలీతో ఆనందంగా గడుపొచ్చు అని సమాధానం ఇచ్చాడు.

Also Read..

భార్య కంటే భర్త ఎందుకు పెద్దగా ఉండాలో తెలుసా? 

Tags:    

Similar News