Mosquito repellent : దోమల బాధ భరించలేకపోతున్నారా..? బాల్కానీలో ఈ మొక్కలు పెంచితే చాలు!

Mosquito repellent : దోమల బాధ భరించలేకపోతున్నారా..? బాల్కానీలో ఈ మొక్కలు పెంచితే చాలు!

Update: 2024-10-23 07:39 GMT

దిశ, ఫీచర్స్ : పలు రకాల సీజనల్ వ్యాధుల వ్యాప్తికి దోమలు కూడా కారణం అవుతుంటాయన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వంటి ఫీవర్లు పెరగడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే వాటి నుంచి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. దోమ తెరలు వాడటం, పరిసరాల్లో అపరిశుభ్రత, నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం వంటివి చేయాలని చెప్తుంటారు. అయితే కొన్ని రకాల మొక్కలు బాల్కానీల్లో పెంచితే కూడా దోమల నివారణకు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. అవేమిటో చూద్దాం.

బంతిపూల మొక్కలు

బంతి పూల గురించి అందరికీ తెలిసిందే. పైగా ఇది సీజన్ కూడాను. చూడ్డానికి చిన్న మొక్కే అయినా ఒక్క మొక్కకు ఏడెనిమిది పూల వరకు పూస్తాయి. వీటిని పెరట్లో, బాల్కానీల్లో పెంచితే ఇంటికి అందాన్నిస్తాయి. ప్రధానంగా ఈ మొక్కల వాసన దోమకు పడదు. కాబట్టి దోమల బెడద ఎదుర్కొంటున్నవారు బంతిపూల మొక్కలను తమ ఇంటి ముందు బాల్కానీలో పెంచుకుంటే వాటిని నివారించవచ్చునని చెప్తున్నారు. దోమలే కాదు.. కొన్ని రకాల కీటకాలు కూడా బంతి పూల మొక్కల పరిసరాలకు రావడానికి భయపడతాయి. వాటి వాసనకు దూరంగా వెళ్లిపోతాయి.

నిమ్మగడ్డి మొక్క

సుగంధ పరిమళాలు వెదజల్లే ప్లాంట్‌గా నిమ్మగడ్డి మొక్క ప్రసిద్ధి చెందింది. దీనిని పలు దోమల నివారణ ఉత్పత్తులలో కూడా వాడుతారు. మస్కిటో కాయిల్స్, పలు సువాసన భరిత పెర్ఫ్యూమ్‌లలో యూజ్ చేస్తారు. అయితే దీని వాసన దోమలకు నచ్చదు కాబట్టి.. ఈ లెమన్ గ్రాస్ మొక్కలను ఇంటి పెరట్లో లేదా బాల్కానీలో పెంచితే వాటిని నివారించవచ్చు.

లావెండర్ ప్లాంట్స్

లావెండర్ మొక్క వాసన వల్ల మైండ్ రిలాక్స్ అవుతుందని, దాని ప్రభావంతో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తుంటారు. అయితే దోమలకు మాత్రం ఈ వాసన విషంతో సమానంగా పనిచేస్తుందట. అందుకే పలు రకాల దోమలు, కీటకాల నివారణ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. అయితే లావెండర్ మొక్కను ఇంటి పరిసరాల్లో లేదా బాల్కానీలో పెంచడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి, కాబట్టి దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

పుదీనా మొక్క

మనం ప్రతిరోజూ వంటకాల్లో వాడే రుచికరమైన పుదీనా మొక్క వాసనకు కూడా దోమలు రావు. అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నందున పుదీనా ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెప్తుంటారు. ఆహారంలో భాగంగా యూజ్ చేయడంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి. చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే ఈ మొక్కను బాల్కానీలో పెంచితే ఆ పరిసర ప్రాంతాలకు దోమలు, కీటకాలు రాకుండా ఉంటాయి. కాబట్టి సీజనల్ వ్యాధుల వ్యాప్తిని కూడా పరోక్షంగా అరికట్టవచ్చు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News