Moon Photo : పసిఫిక్ తీరంలో అందాల చందమామ.. కొత్త ఫొటోను విడుదల చేసిన నాసా
చల్లని రేయి.. వెన్నెల రేడు అంటూ చందమామ అందాలను వర్ణించే పాటలను మీరు ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. అలాంటి అద్భుతమైన దృశ్యం కళ్ల ముందు కదలాడితే ఎవరికైనా మనసు ఆనందంతో పొంగిపోతుంది.
దిశ, ఫీచర్స్ : చల్లని రేయి.. వెన్నెల రేడు అంటూ చందమామ అందాలను వర్ణించే పాటలను మీరు ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. అలాంటి అద్భుతమైన దృశ్యం కళ్ల ముందు కదలాడితే ఎవరికైనా మనసు ఆనందంతో పొంగిపోతుంది. అయితే మరోసారి అచ్చం అలాంటి ఫీలింగ్ కలిగించేలా చంద్రుడికి సంబంధించి మరో అద్భుత దృశ్యాన్ని అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తన కెమెరాలో బంధించాడు వ్యోమగామి మాథ్యూ డామ్నిక్. ఆ వివరాలేంటో చూద్దాం.
పసిఫిక్ మహా సముద్ర తీరంలో అల్లంత దూరాన నీలాకాశంలో మబ్బుల చాటున దోబూచులాడుతున్న చంద్రుడిని చూస్తే ఎలా ఉంటుంది? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉన్న వ్యోమగామి మాథ్యూ డామ్నిక్ మదిలో కూడా సరిగ్గా ఇదే ఆలోచన మెదిలింది. వెంటనే తన కెమెరాను అటువైపు నుంచి అంతరిక్షానికి ఫోకస్ చేశాడు. ఇంకేముంది?.. నీలి ఆకాశం.. అందులో తెల్లటి మబ్బులు, మధ్యలో చంద్రుడు కనువిందు చేశాయి. ‘పసిఫిక్ తీరం నుంచి చూస్తే చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో చూడండి’ అంటూ వ్యోమగామి మాథ్యూ ఎక్స్ వేదికగా తాను తీసిన ఫొటోను పంచుకున్నాడు. హవాయి వద్ద తుఫాన్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో ఈ అందమైన దృశ్యం తనను బాగా అట్రాక్ట్ చేసిందని పేర్కొన్నాడు. ఇక అంతరిక్ష అద్భుతాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అందించే నాసా కూడా ఈ అందాల చందమామ ఫొటోను తన సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయగా.. చాలా బాగుందంటూ నెటిజన్లు క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు.
Moon Photo Credits To Astronaut Matthew Damnick X Id