యవ్వన ఛాయను పెంపొందించే అద్భుత ఫలాలు.. ఎలా పనిచేస్తాయంటే..

ఎన్ని ప్రయత్నాలు చేసినా శరీరంలో వయస్సు రీత్యా వచ్చే మార్పులను అడ్డుకోవడం అసాధ్యం. అయినా ఎల్లప్పుడూ తాము వయవ్వనంగా కనిపించాలని మాత్రం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

Update: 2024-06-27 12:27 GMT

దిశ, ఫీచర్స్: ఎన్ని ప్రయత్నాలు చేసినా శరీరంలో వయస్సు రీత్యా వచ్చే మార్పులను అడ్డుకోవడం అసాధ్యం. అయినా ఎల్లప్పుడూ తాము వయవ్వనంగా కనిపించాలని మాత్రం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వయస్సు మీదపడినా కనీసం ముఖంలో ఆ ఛాయలు కనిపించకుండా ఉండాలని భావిస్తుంటారు. రకరకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు. వ్యాయామాలు చేస్తుంటారు. అయితే వృద్ధాప్య ఛాయలను శాశ్వతంగా అడ్డుకోవడం సాధ్యం కాదు కానీ.. ఆలస్యం చేయడంలో మాత్రం కొన్ని చిట్కాలు పనిచేస్తాయి. అలాంటి వాటిలో కొన్ని పండ్లు కూడా ఉన్నాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల వయస్సు రీత్యా చర్మంపై వచ్చే ముడతలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలు ఆలస్యమై యవ్వనంగా కనిపిస్తారట.

* బెర్రీలు : బెర్రీలు తరచుగా తినడంవల్ల చర్మంపై వృద్ధాప్య ఛాయలను నివారిస్తాయి. బ్లూ బెర్రీస్‌ను సూపర్‌ఫుడ్స్‌గా అందుకే పేర్కొంటారు. చిన్నగా ముదురు నీలం రంగులో ఉండే ఈ పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని ఆంథోసైనిన్ మీ చర్మంలో వృద్ధాప్యం రాకుండా నివారిస్తుంది. విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటంతో స్కిన్‌ను స్మూత్‌‌గా ఉంచడంలో హెల్ప్ అవుతుంది.

* అవకాడో: అవకాడో వాస్తవానికి పోషకాల గని. ఇందులో సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఫైబర్, ఇతర పోషకాలు, విటమిన్లు ఉంటాయి. కాబట్టి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతోపాటు మెరిసేలా చేస్తాయి. ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్‌ను ఉత్తేజపరుస్తుంది. కాబట్టి ఆహారంలో భాగంగా అవకాడో చేర్చుకోవాలి.

* దానిమ్మ: ఇందులో పాలీఫెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఫుల్లుగా ఉంటుంది. ఇది చర్మాన్ని వృద్ధాప్య ఛాయల నుంచి దూరం చేస్తుంది. అలాగే బయట కాలుష్యం నుంచి, యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ముఖం. ఇతర శరీర భాగాల్లో ముడతలను నివారిస్తుంది. యవ్వనంగా కనిపించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

* బొప్పాయి : విటమిన్లు, మినరల్స్, ఎంజైములు ఫుల్లుగా ఉంటాయి కాబట్టి బొప్పాయి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. అంతాకుండాకు విటమిన్ ఎ, సి, ఇ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇక బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ స్కిన్‌లోని డెత్ సెల్స్‌ను తొలగిస్తుంది. చర్మంపై ఉండే రంధ్రాలను అన్‌క్లాగ్ చేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

* కివీ పండు: ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఇది కొల్లాజెన్ ప్రొడ్యూస్‌ను ప్రేరేపిస్తుంది. స్కిన్‌లో గరుకుతనం తగ్గి మృదుత్వం పెరుగుతుంది. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఫుల్లుగా ఉండటంతో ముఖంపై ముడతలు, గీలు తగ్గుతాయి. చర్మంలో యవ్వన ఛాయ కనిపిస్తుంది.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాల విషయంలో ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 


Similar News