చింతపండుతో కాదు.. డబుల్ రుచినిచ్చే శెనగపిండితో చారు ట్రై చేయండి

ఎప్పుడూ రొటిన్‌‌గా చింతపండుతో కాకుండా ఈసారి శెనగపిండితో చారు ట్రై చేయండి.

Update: 2024-09-27 14:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడూ రొటిన్‌‌గా చింతపండుతో కాకుండా ఈసారి శెనగపిండితో చారు ట్రై చేయండి. డబుల్ రుచిని ఇస్తుంది. పైగా శెనగపిండిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. కాగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఫుడ్ అని చెప్పుకోవచ్చు. శెనగపిండిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. శెనగపిండితో ఉండే డైటరీ ఫైబర్ హార్ట్ పూర్తి ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో తోడ్పడతాయి. అయితే ఈ శెనిగపిండితో ఓసారి డబుల్ రుచినిచ్చే చారు చేసి అన్నంలో తినండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

శెనగపిండి చారుకు కావలసిన పదార్థాలు..

రెండు స్పూన్లు శెనగపిండి, పచ్చిమిర్చి- ఉల్లిపాయలు-2, టమాటోలు - మూడు, గుప్పెడు కరివేపాకులు, కొంచెం చింతపండు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఆవాలు, జీలకర్ర, పసుపు- అరస్పూన్, కారంపొడి - ఒక స్పూను, సాంబార్ పొడి, ఉప్పు, నూనె సరిపడ, కొత్తిమీర తరుగు.

తయారీ విధానం..

ముందుగా శెనిగపిండిని గరిటతో కలుపుతూ గట్టిగా అయ్యేవరకు ఉడకబెట్టాలి. కొంచెం చింతపండు వాడిన చింతపండు నీటిని పోసి మరిగించి.. మళ్లీ వేరే కడాయిలో పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, టమాటోలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, పసుపు, జీలకర్ర వేసి పోపు వేసుకోవాలి. అందులో పక్కకు పెట్టిన మిశ్రమాన్ని పోయాలి. తర్వాత కారం, ఉప్పు, కొత్తిమీర, సాంబార్ పొడి చల్లుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ శెనిగపిండి చారు రెడీ అయిపోయినట్లే.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News