Menopause: మహిళల్లో పీరియడ్స్ ఏ ఏజ్‌లో ఆగిపోతాయో తెలుసా?.. మోనోపాజ్ లక్షణాలు ఇవే..!

సాధారణంగా ప్రతి ఒక్క అమ్మాయికి నెల నెల పీరియడ్స్ వస్తుంటాయి.

Update: 2024-09-14 05:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ప్రతి ఒక్క అమ్మాయికి నెల నెల పీరియడ్స్ వస్తుంటాయి. అయితే ఒక వయసు వచ్చాక పీరియడ్స్ రావడం ఆగిపోతాయి. అలా పీరియడ్స్ ఆగిపోతే మహిళలు మోనోపాజ్ దశలోకి అడుగు పెట్టినట్టే. మరి పీరియడ్స్ అనేది రాకుండా ఎప్పుడు ఆగిపోతాయి. మోనోపాజ్ దశ లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఏ వయసులో పీరియడ్స్ ఆగిపోతాయి..?

సాధారణంగా మహిళలు 45 నుంచి 55 ఏళ్ల వయసులో మోనోపాజ్‌లోకి అడుగుపెడతారు. ఈ సమయంలో అండాశయాలు అండాలను విడుదల చేయడం ఆపేస్తాయి. అప్పుడే పీరియడ్స్ కూడా ఆగిపోతాయి. ఒక సంవత్సరం పాటు క్రమంగా పీరియడ్స్ రాకపోతే మోనోపాజ్ దశలోకి సహజంగా అడుగుపెట్టినట్టే. అంటే ఇక పిల్లలు పుట్టే అవకాశం పోయినట్టే. అలా కాకుండా కొన్ని కొన్ని సార్లు రేడియేషన్, కీమోథెరపీ లాంటి అండాశయాలు తొలగించాల్సిన అవసరం పడే చికిత్సల వల్ల, గర్భాశయం తొలగించిన కూడా పీరియడ్స్ ఆగిపోతాయి. కాకపోతే ఈ వయసులో కూడా కొన్ని సంతాన సాఫల్య చికిత్సల ద్వారా మాత్రం పిల్లల్ని కనడం సాధ్యం పడవచ్చు.

మోనోపాజ్ లక్షణాలు..

మోనోపాజ్‌తో వచ్చే మార్పుల వల్ల శారీరకంగా, మానసికంగా చాలా ప్రభావం పడుతుంది. ప్రతి వ్యక్తికి ఈ లక్షణాలు మారొచ్చు. అయితే కొంత మందికి ఈ లక్షణాలు ఉండకపోవచ్చు. మరికొంతమంది ఈ లక్షణాలతో ఏళ్ల తరబడి బాధ పడుతూ ఉండొచ్చు. మరి మోనోపాజ్ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం..

1) రాత్రిపూట చెమటలు పట్టడం. ఉన్నట్టుండి ఫీవర్ వచ్చినట్లు అయ్యి శరీరం హీట్ ఎక్కడం, ముఖ్యంగా ముఖం, మెడ, ఛాతీ దగ్గర వేడిగా అనిపిస్తుంది.

2) నెలసరి క్రమంలో మార్పులు రావడం, బ్లీడింగ్ ఎక్కువ లేదంటే తక్కువ కావడం కూడా మోనోపాజ్ లక్షణాలే.

3) యోని దగ్గర పొడి బారడం. లైంగిక కలయికతో నొప్పి రావడం.

4) భావోద్వేగాల్లో మార్పులు, డిప్రెషన్, ఆందోళన పెరగడం.

5) నిద్రలేమి సమస్య చుట్టుముట్టడం లేదా నిద్రపోవడంలో ఇబ్బంది కలగడం.


Similar News